పుట:AndhraRachaitaluVol1.djvu/472

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వాడైన కావచ్చు. ప్రాకృతానుభవములు నాభాషలో ఎన్నడైనా వ్యక్తపరిచి ఉంటే అది సజీవభాషే అవుతుంది. కాబట్టి యీలక్షణము కలిగి ఉన్నంతసేపున్నూ కావ్యభాష సజీవభాష కాదనడానికి వీలులేదు. కావ్యములలో ఉపయోగింపబడక పోయినంత మాత్రముచేత అది సజీవభాష కాకపోదు. భాషాప్రయోజనము సిద్ధిస్తున్నంతసేపున్ను అది సజీవభాషే. కాని, ఆభాష కేవలవ్యావహారికమై స్థూలజగత్ర్పచారములో ఉన్నా కావ్యజగత్తులో తాండవించి సూక్ష్మేంద్రియగ్రాహ్యము మాత్రమే అయినా సంస్కృతవాణికి లక్షణములుగా ఆలంకారికులేర్పఱిచిన దశవిధ గుణభూషితమై దశవిధ దోషవర్జితమై మనోహర రస, రీతి, పాకశయ్యాలంకార శోభితమైఉంటే అంత ఆదర పాత్ర మౌతుందని వేరే చెప్పనక్కరలేదు. భాషాశీభ కుపకరించి దాని జీవమును ప్రకటించే విధానము నాలంకారికు లేర్పరించియున్నారు."


భాషా - వాజ్మయములకు నిరంతరసేవ గావించు నారాయణరావుగారి విద్యాభ్యాసాదులను గూర్చి ముచ్చటించు కొనవలయును. ఆయన జన్మస్థానము విశాఖపట్టణ మండలములోని ఆనందపురము. కాని, ఆయనకు రాయలసీమవారుగానే పరిగణనము. నేనిట్లనను. నారాయణరావుగారిది తెలుగుదేశము సర్వమును. ఈసీమల ద్వైతభావము నశించినగాని మనకు ముక్తిలేదు.


పర్లాకిమిడి కళాశాలలోను, విజయనగరము మహారాజ కళాశాలలోను రావుగారి ఆంగ్ల విద్యాభ్యాసము. విజయనగరములో నుండగనే సాహిత్య కృషికి బీజావాపము వాపము జరుగుట. మదరాసు విశ్వవిద్యాలయమున, తెలుగు, కన్నడములలో బట్ట భద్రతా లాభము. తరువాత కొలది కాలమునకే నారాయణరావుగారు "డాక్టరు ఆఫ్ ఫిలాసఫీ". ఈ బిరుదము 11 వ శతకములోని తెలుగు రచనను గూర్చి చేసిన పరిశోధ