పుట:AndhraRachaitaluVol1.djvu/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేంకటాద్రి అప్పారావు

1893


నూజవీడు సంస్థానమునకు సంబంధించిన ' ఉయ్యూరు ' జమీందారు. పెంచినతండ్రి : శ్రీరాజా రంగయ్యప్పారావు. వెలమవంశీయులు. నివాసము : నూజవీడు. జననము 1893 ఏప్రిలు 29 వ తేదీ. గ్రంథములు: గోవర్ధనోద్ధారణము, దుర్యోధనాంతము, పృథ్వీరాయుని యంతము, స్నేహలత, శ్రీశోభనాచల మహాత్మ్యము, జ్యోతిర్లీల, ఆంధ్రాష్టపదులు- ఇత్యాదులు.


ఉయ్యూరు సంస్థానాధిపతులు రంగయ్యప్పారావుగారి సంస్కృతాంధ్రభాషాభిరతి కొంత ప్రసిద్ధమైనది. ' పర్షియా ' లో వారు గడిదేరిన విద్వాంసులట. ఆ వాజ్మయమున బ్రసిద్ధిచెందిన " షాహనామా " యను చరిత్రగ్రంథము కొంతభాగము నాంధ్రీకరించి ప్రకటించుట యందులకు దారకాణ. వీరి తరువాత వేంకటాద్రి అప్పారావుగారు సంస్థానమునకు వచ్చిరి. ఈయనకు గవితాధార నిసర్గముగా బుట్టినది. ఆకారణమున వట్టి ' మెట్రిక్యులేషన్ ' పరీక్షాపాఠ్యములతో దృప్తిపడక సంస్కృతాంధ్రములు చదువుకొనవలసిన శ్రద్ధ కలిగినది. గురుముఖమున గొంత వరకు బఠించి వలయు పాండిత్యమును గలిగించుకొనిరి. ఆపిమ్మట గోవర్ధనోద్ధారణము, శోభనాచల మాహాత్మ్యము, జ్యోతిర్లీల మొదలగు నాటక-కావ్యాదులు రచించెను. ఈయనకు నాట్యము, జ్యోతిషము, చిత్రకళ, సంగీతము మొదలగు విద్యలలో మంచి ప్రవేశమున్నది. ఈకళలెల్ల వీరిని స్వయంవరించినవి. చిత్రకళలో వీరికిగల స్వజనశక్తికంటె నభిమానము హెచ్చు. కవితావిషయమున వీరు గావించిన పరిపుష్టికంటె రచనాసృష్టి యున్నతస్థానమున నుండదగినది. వీరి సంగీతసాహిత్యాభిమానములకు ' ఆంధ్రాష్టపదులు ' దృష్టాంతము. ఇటీవల నందమైన