పుట:AndhraRachaitaluVol1.djvu/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాకృతిలో దీర్చిదిద్ది యాంధ్రి కర్పించిరి. వచస్సందర్భశుద్ధి నెరిగిన జయదేవుని మధురగేయములను దెనుగు బాటలుగాను, శ్లోకములను బద్యములుగాను మార్చి ' ఆంధ్రజయదేవు ' డనిపించు కొన్నా రప్పారావుగారు. ఈరాజకవి రసోత్మేకమైన రచనా రమణీయకమున కీపద్యము మచ్చు :-


జారెన్ బిల్లనగ్రోవి చేనడలి కన్‌సైగన్ వ్రజస్త్రీతతిన్
ఓరం దొల్గగ కన్బొమ్మల్ మెలచి యెంతో భీతి లేజెమ్మటల్
గారన్ నన్గని సిగ్గు చిన్న నగవున్ గన్మోడ్పు తబ్బిబ్బులన్
దోరంబౌ హరి జూడ లోగలగె సంతోషంబు రోషంబునున్.


తెనిగింపు పొందికగా నుండి యింపు పుట్టించుచున్నను నాత్మప్రత్యయము చాలక " ఆ జయదేవునత్కవన మామృదుశైలియు భావరక్తియున్ నైజ మనోహర ప్రతిభ నాతెనిగింపునకెట్లు వచ్చు ? " నని వినయముగా జెప్పుకొన్నారు.


ఈయన రాధాకృష్ణ ప్రేమోపాసకుడు. వీరి చిత్రకళా నికేతనము దీనికి బతాక. రసికత నెరిగిన కవి యౌట శృంగారరసవిలసితములైన యితివృత్తములే వీరి రచనలకు నమధిక ప్రోత్సాహమిచ్చినవి. వంశము పౌరుషవంతమైనదనుట వీరగాథలు కూడ వీ రేరుకొని కబ్బములుగా గూరిచినారు. ఎర్రపంచె కట్టి, తెల్లని పొట్టి చేతులచొక్కా తొడిగి, చిన్న తువ్వాలు పయిని పడవైచికొనియుండు నీ భాగ్యవంతునివేసము దేశమున కొరవడి. ఈయన జ్యోతిర్లీల నాటకము మొదట నిటులు చెప్పుకొనెను.


సీ. కన్నారు నన్ను వేంకటరంగయప్ప రా
          యలు నారయామ్మ నిర్మల విభవులు