పుట:AndhraRachaitaluVol1.djvu/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యేటనే కవిత్వమునకు శ్రీకారము చుట్టుకొనెను. పదునెన్మిదవయేట 'మణిమాల' యనునాటకము వ్రాసెను. అది మొదలు క్రమముగా బహు గ్రంథరచన. దేశమును భాషను సమప్రతిపత్తితో సేవించుకొనుచున్న వీరిని జాలమంది పిలిచి యుద్యోగము నిత్తుమని యడగిరి. అల్పములైన పనుల కిష్టపడక 1934 సం. లో వీరు అఖిలభారత శాసనసభకు సభ్యులై యామరణ మాయుద్యోగమే నిర్వహించిరి. 1936 సం.లో, International Academy Of America ఉమర్ అలీషాకవికి Doctor Of Literature బిరుదమునిచ్చి మెచ్చినది. 'నూఫీవేదాంత దర్శము' అనుపద్యకావ్యము మొదల నీకవి స్వీయగాథ కొన్నిపద్యములలో హృద్యముగా వర్ణించుకొనెను. అవి మన కవసర పడును.


క. ఆ మొహియద్దీన్ బాద్షా

నామ మహాయోగి కగ్రనందనుడను నా

నా మహితాగమ హిత వి

ద్యామతి 'ఉమ్రాలిషా' మహాకవి నేనున్.


సీ. రచియించినాడ విభ్రాజితదివ్య ప్ర

బంధముల్ పది కావ్య బంధములుగ

వ్రాసినాడను కల్పనాసక్తమతి పది

నాటకంబులను గర్ణాట ఫక్కి

కూర్చినాడను గళా కోవిదుల్ కొనియాడ

నవలలు పది నవ నవల లనగ

తెలిగించినాడ నుద్దీపితాఖండ పా

రసి కావ్యములు పదిరసికు లలర


గీ. రసము పెంపార నవధాన క్రమములందు

నాశువులయందు పాటలయందు కవిత

చెప్పినాడ నుపన్యాససీమ లెక్కి

యవని "ఉమ్రాలిషా కవి" యనగ నేను.