పుట:AndhraRachaitaluVol1.djvu/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"తెనుగు కావ్యాదర్శనము" లోని పద్యము:-

సీ. లష్కరు నగరి కల్లవ్పసత్రంబున

షష్ట్యవధానంబు సంతరించి

గద్వాల నగరున విద్వత్సభ నశీతి

లేఖినీ కవన మల్లింపజేసి

ఆత్మకూరు నగరి నాశుకవిత్వ లీ

లాస్ఫూర్తి రాజవల్లభ్యమొసగి

ముక్త్యాల నృపుచెంత మోహనంబైన యు

పన్యాసధోరణి వరల జేసి


గీ. తగగ బలుచోట్ల నష్టావధాన సభల

నాశుధారాకవిత్వ మహత్త్వ మిచ్చి

నన్ను మనుచు మాతల్లి మన:ప్రమోద

దానసంతాన వల్లీమతల్లి గొలుతు.


                           ____________