పుట:AndhraRachaitaluVol1.djvu/294

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రఘువంశము మొదలిడి, కావ్యములు, నాటకములు మున్నగా జదువవలసిన వెల్ల జదివిరి. తెనుగులు తనివితీఱ వినిరి. తండ్రిని స్మరణకు దెచ్చుచు, పండితుల మెచ్చు లందుచు జానుదెనుగులో దియ్యని కవిత్వము కట్టుటకుపక్రమించిరి. రఘువంశము, కుమారసంభవము, శ్లోకమునకు బద్యము చొప్పున జెప్పిరి. మొన్న 1940 లో మేఘదూతమునకు కడు గ్రొత్తరీతిని గేయములలో ననువాదము గావించి ప్రకటించిరి. ఆంధ్రకాళిదాసుడని యీయనకు బిరుదమున్నది. 'బారతీతీర్థము' లో శ్రీజయపురాధీశ్వరునివలన వీరికి 'కవిభూషణ' యను నుపాధి లభించినది. వానితో బనేమి? ఆంధ్ర విశ్వకళాపరిషత్తువారు 1943 లో జిలకమర్తి కవితో పాటు వీరిని 'కళాప్రపూర్ణు' లని బిరుదనామ మిచ్చి మెచ్చిరి.

సూర్యప్రసాదరాయ కవి కవితాకళలో బ్రపూర్ణు డనుట కతని కృతులు పరమప్రమాణములు ఇక్కవిమణికి దిక్కనమభి కవిత యాదర్శముగా నుండి యున్నటులు పదము పదమున గానవచ్చును. పొలుపు గల తెలుగు పలుకు గూర్పులో మంచి నేర్పు మన కవి గారి కున్నది. వీరి 'నిర్వచన కుమార సంభవము' లో నెల్లను గందములు, గీతములు, పెద్దవృత్తములు పెక్కు లేవు. ఉదాహరణమున కొక మెత్తని పద్యము చూడుడు:

క. కటముల తీటలు వో గజ

ఘటలు సరళతరుల రాయగా బాల్వడి తత్

స్ఫుటతరపరిమళ భర మ

చ్చొటున న్నెత్తముల జేయు సురభిళములుగాన్.

'రఘూదయము' లోని వొక రెండు ప్రకటింతును:

మ. ఒకనాడొక్కమదాంధ సిందురము గండోద్భూత కండూతి కో

ర్వక యీ చెట్టునరాయ మాడె వలపారన్ దీనిపైపట్ట దా