పుట:AndhraRachaitaluVol1.djvu/278

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గూర్చి యుపన్యాసము లిచ్చుచుండువారట. శతావధానము చేయగలరనియు వినికి. వీరికి దంజనగర రాజ పోషణము పసివడక చెన్నపట్టణము వచ్చివైచిరి. పట్టణమున బహుకాలము భగవద్విషయక ప్రవచనములతో గాలక్షేపము చేసిరి. ఇట్టి యీతాతగారిపేరు నిలబెట్టుటకు మన తేవప్పెరుమాళ్ళయ్యగారు పుట్టి, వారికంటె నూరురెట్టులు ధట్టుడై వెలసెను. మనదేవరాజసుధి పండితుడుగాని, పండితపుత్రుడు గాడు. ఇతనితండ్రి రంగమన్నారయ్యగారు వ్యాపారసరణిలో జేయి తిరిగిన వారు. ఆయన శతసంవత్సర దీర్ఘాయువునంది మొన్న 1921 లో బుత్ర శోకమనుభవించి, రెండేడులుండి మఱి మరణించెను.

మన తేవప్పెరుమాళ్ళయ్యకు దేవరాజసుధి యను పేరున్నటులు మన మెఱుగుదుము. చిన్నతనములో నీయనకు జిన్నయ్య యనికూడ వ్యావహారికనామ ముండెడిదట. శ్రీ పరవస్తు చిన్నయసూరిగారి శిష్యులును, విశ్వగుణాదర్శాంధ్రీకర్తలు నైన తేవప్పెరుమాళ్ళయ్యగారి కడ మన దేవరాజసుధి కావ్యనాటకాదులు, వ్యాకరణము పఠించెను. పదునాఱుసంవత్సరముల వయస్సు దాటకుండ గనే "మెట్రిక్యులేషన్" పరీక్ష నుత్తీర్ణుడై, ప్రవేశపరీక్షకు జదువుచుండగా, సంసారపు జిక్కులు పెక్కు తటస్థించి, యాచదువు నంతతో నాపివేసినవి. విస్థారమగు బధిరత్వముండిన కారణమున దొరతనమువారి యుద్యోగముల కానపడక, దేవరాజసుధి సాహుకారులదగ్గర నాశ్రయము సంపాదించుకొని కొన్నేండ్లు గడపెను. ఆసమయముననే యాంగ్లము, అఱవము చక్కగా గృషిచేసి, తెనుగెల్ల స్వయముగ జదివిచూచి, సంస్కృతములో శ్రద్ధమై సిద్దాంతకౌముది పఠించి, కొంతతర్కము, కొంచెము మీమాంస గురుముఖమున నధ్యయనించెను. ఆ సాహిత్యపు సాహసముతో "భగవద్గీత" తీసి విశేషార్ధ ప్రతిపాదకముగ నొక వ్యాఖ్య వ్రాసెను. ఆరచనయే యానందముద్రాలయము వారికి దేవరాజసుధికి జెలికారము