పుట:AndhraRachaitaluVol1.djvu/261

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యాంధ్రి కఖండసేవజేసి యస్వర్థమైన స్మరణీయమహాసంస్థ. అప్రస్తుతమైనను లక్ష్మణరావుగారితోపాటు దీనిని సంస్తుతింపక తప్పదు.

లక్ష్మణరావుపంతులు గారికి వీరేశలింగముగారే లక్ష్య స్వరూపులు. వీరు తమరచనము సామాన్య గ్రాంథికముగ నడపించి జనబాహుళ్యము నాకర్షించిరి. కాని నాటికి, బెచ్చుపెరిగియున్న గ్రాంథికవ్యావహారిక వాదప్రతివాదసమరములో జేయిచేసికొనలేదు. ఆ తాటస్థ్యమే వీరిచే నమూల్యమగు విజ్ఞానసేవ చేయించినది. దేశభాషయొక్క సర్వతోముఖాభ్యుదయము, దేశభాషయందు సర్వశాస్త్రములు వెలువరింప వలయునన్న యభినివేశము కలిగి కొంతవఱకు గృతకృత్యుడై ననుకృతియితడు. ఆయన యభిలషించినది భాషాజీవము, భాషాస్థిరత్వము. లక్ష్మణరావుగారుకూడ గొందఱవలె దెగుదెంపులేని భాషావివాదవాగురలో దగుల్కొనినచో 'విజ్ఞానచంద్రిక' యేతరగతిగ్రంథమాలలలో లెక్కింపబడవలసియుండెడిదో!

మనభాషలోలేని శాస్త్రగ్రంథము లుండరాదనియు, నప్పుడే వాజ్మయమునకు సుస్థిరత్వము చేకూరుట కవకాశముండుననియు వీరి ప్రధానాశయము. ఈయాశయమే పంతులుగారికి బ్రబంధములమీదను, ఖండకావ్యములమీదను మక్కువ తక్కువచేసినది. ఇంతమాత్రమున నీయనకు గావ్యకళాదృష్టి గాని, కావ్యరసాస్వాదశక్తి గాని లేదనుటకు వీలుపడదు. లలిత కళలనుగూర్చి వెలువరించిన వీరి ప్రత్యేక గ్రంథము, కావ్యకళనుగూర్చిన వీరి ప్రత్యేక వ్యాసములు వీరికి గళాపరిశీలకులలో గౌరవస్థానము నీయకపోవు. కేవలకావ్యములవలన వాజ్మయమునకు శాస్వతత్వముకలుగ దని యొక యభిప్రాయము పెట్టుకొని శాస్త్రగ్రంథ రచన ప్రకటములకు జీవితమర్పించిరి.

ఆంధ్రదేశచరిత్రరచనకు శ్రీకారముచుట్టిన మహాశయుడీతడే.నీవు నాటిన విత్తు నేటికి మహావృక్షమైనది. ఈయన యేవిషయమును