పుట:AndhraRachaitaluVol1.djvu/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు వ్రాసిరి. లక్ష్మీనరసింహకవి జ్ఞానైకచక్షుష్కుండు. వీరికి 40 వత్సరములు యీడు వచ్చువఱకు సంపూర్ణనేత్రావరోధము కలుగలేదు. 1909 నుండి మాఱెను. 'కృపాంభోనిధి' నీకవి యీవిధముగ బ్రార్థించు చున్నాడు:


అన్నా ! నీద గుమూర్తి యెట్టిదియొ జాత్యంధుడు కాలాద్యవ

చ్ఛిన్నంబై జగదేక పూర్ణమగు నీ చిన్మాత్ర దివ్యాకృతిం

గన్నారం గను బుండరీకదళసంకాశ స్ఫురన్నేత్రుడున్

నిన్నుం జూడగలేడు చిత్ర మిది తండ్రీ ! సత్కృపాంభోనిధీ !

అందలి యమృతనిష్యందులగు పద్యములు మఱికొన్ని:


శా. తోలుంగన్నులు చూడలేవుగద విద్యుత్కోటి భాస్వత్ప్రభా

జాలాతీత జగత్ప్రపూర్ణ ఘన తేజో రాశి నీమూర్తి నిన్;

నాలోగన్న యినం గనుంగొను నటన్నన్ జ్ఞాననేత్రంబు లే

నేలే; దేగతి నిన్ను జూడనగు దండ్రీ సత్కృపాంభోనిధీ !


మ. బలిమిన్ రబ్బరు లాగ సాగి మొదటన్ స్వస్థానముంజేరు నా

వల, నట్లే బలిమి స్మనస్సును భవత్పాదద్వయి న్ని ల్ప నా

స్థలమందయ్యది నిల్వ కెప్పటియటుల్ దౌర్గత్యముంజెందు, ని

ష్ఫలమౌ నాజతనం, బి కేమిగతి దేవా ! సత్కృపాంభోనిధీ !


శా. ఆకుంబచ్చల పళ్లెరంబుల బ్రవాళాలి న్ని వాళుల్ తగన్

నీకర్పించి, విహంగనాదమను మేల్గీతంబులంబాడి, తా

మేకాలంబును బూలు కాంకలిడి తండ్రీ ! భక్తి వృక్షాంగనల్


నీ కాత్మీయకృతజ్ఞతం దెలిపెడు న్నేర్మిన్ కృపాంభోనిధీ !

మ. గగనం బద్భుతలీల నీదగు నిరాకారత్వమున్ గాలి నీ

దగు విష్ణుత్వము, నీరు నీకరుణ, దీప్యద్వహ్ని నీతేజు నీ

దగు శాంతిన్ ధర చాటుచున్నయవి, యాహా! పంచభూతంబు లే

పొగడున్నీ గుణరాజి వందులయి శంభూ ! సత్కృపాంభోనిధీ!