పుట:AndhraRachaitaluVol1.djvu/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీయొద్ద నేదైనగలదా ? యని యడుగ "దమ రనుగ్రహించినదే" యని సమాధానముచెప్పి జరిగినకథ వెల్లడించిరట.


ఇంతకును జెప్పబోవున దేమన ? ఏనాడో యట్లు ధారణపట్టిన పద్యములు నేటికిని వారు చదువుచు బ్రాచీనకవుల కవిత్వ విశేషములను శ్లాఘించుచుందురు.


పంతులుగారు గొప్ప యుపన్యాసకులు. వీరి యుపన్యాసము దూరాన్వయములు లేక మృదువుగానుండి హాస్యరస ప్రచురములగు నుదాహరణములతో శ్రోతల కానంద మొదవించును.


వీరు 'మెట్రుక్యులేషన్‌' పరీక్షలో గృతార్థులై యాంగ్లసారస్వతమును లెస్సగా నెఱిగిరి. గురుశుశ్రూష చేసి సంస్కృతభాష నభ్యసింపక పోయినను నేత్రావరోధము వాటిల్లినతరువాతనే భానకాళిదాస భవభూత్యాది సంస్కృతకవుల రచనలు చదివించి స్వారస్యముల దెలిసికొని భాసనాటకచక్రము (13 నాటకములు) మధురరీతి నాంధ్రీకరించి తమ యనల్పప్రతిభ వెల్లడించికొనిరి. కొన్నిపట్ల వీరి తెలుగుసేత మూలానుకూలముగ నుండకున్నను నాటకరచనలో సిద్ధహస్తులగుటచే భాననాటకాంధ్రీకరణము మనోహరముగా నున్నది. సీసపద్యముల దిగువ నెత్తుగీతములు లేకుండ వ్రాసిరి. ఇది క్రొత్తపద్ధతి.


హోమర్ (గ్రీకుజాతీయకవి) మేధావిభట్టు, కుమారదాసుడు,మెల్టను మున్నగు మహాకవులవలె లక్ష్మీనరసింహముగా రంధులయ్యును ప్రకృతిరహస్యములు ప్రతిభాబలముచే బ్రత్యక్షీకరించుకొని కవిత్వము చెప్పిన మహాకవులు. వీరు కొన్ని పద్యములు మన:ఫలకముమీద వ్రాసి వుంచుకొని యెవరైన లేఖకు లున్నపుడు వెల్లె వేసినపద్యములు చెప్పుచున్నట్లు చెప్పి వ్రాయించుచుందురు. ఇట్లే వీరు లెక్కలేనన్ని గ్రంథ