పుట:AndhraRachaitaluVol1.djvu/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఱొక చోట బనిచేయుట చాలచోట్ల నున్నదేగాని క్రొత్తదికాదు. జయంతి రామయ్య పంతులుగారికి యావజ్జీవము న్యాయవాదిగా నుండవలయునని సంకల్ప ముండెడిదట. అట్టియదృష్ట మాయనకు బట్టనేలేదు. ఇంతకును జెప్పున దేమన:- బ్రహ్మయ్యశాస్త్రిగారు లేఖకవృత్తిలో నుండికూడ జగద్విఖ్యాతమైన విమర్శనము లొనరించి 'విమర్శకాగ్రేసరు' డనిపించుకొనుట బహుథా శ్లాఘనీయము.


శాస్త్రిగారు 'మెట్రిక్యులేషన్‌' పరీక్షలో నుత్తీర్ణులై ఎఫ్.ఏ. పరీక్షకు జదువుచు గారణాంతరములచే జదువువిరమించి యుద్యోగబంధములో బడవలసినవారైరి. అది యొకందులకు మేలైనది. కళాశాల చదువు కట్టిపెట్టిన తరువాత గౌముది కట్టుదిట్టముగ జదివి, సంస్కృతాంధ్రములలో దలస్పర్శి యగు పాండిత్యము సంపాదించిరి. "రప్రత్యాహారమండన మండన" మాకాలమున వ్రాసినదే. వీరు భాషాత్రయములో సమానము నసమానమునగు పాండిత్యము గడించి పండితు లనిపించుకొనినారు. ఈయనకు సాదృశ్య భాషాశాస్త్రముపై (PHILOLOGY) మక్కువ హెచ్చు. ఆ సాదృశ్య పరిశీలనము భాషయందేగాక మతములయందుగూడ బ్రవేశపెట్టిరి. హిందూమతతత్త్వము లోతుముట్టబరికించిరి. వీరేశలింగంపంతులుగారికి వీరికిని జాలకాలము హోరాహోరి యుద్ధము జరిగినదని తెలుగువా రెఱిగినదే. నాటి బ్రహ్మయ్యశాస్త్రిగారి వా గ్వజ్రప్రయోగమును బండితు లెఱిగినదే. విమర్శలో నింత నిర్దాక్షిణ్యుడు లేడనికదా గిడుగువారు చెప్పిరి.

బ్రహ్మయ్యశాస్త్రిగా రెంతసునిశితవిమర్శకుడో యంత కర్మవీరుడు.--------వ్యాసములు వ్రాయుట, నుపన్యాసము లిచ్చుచు, సంస్థల----------వైజ్ఞానికవిషయ ప్రబోధముచేసిన పుణ్యచరిత్రులు--------------------కళాభిరుచికలిగి "ఆర్యబృందానంద సంధా---------------------------చెప్పుదురు. అందు వీరి

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)