కవిత్వమున నూతనత్వమును దెచ్చుటకు బ్రయంత్నించిన కవులుగారు వీరు. కాని శైలి ధారాళమైనది.
లీలాపాంగవిలోకనంబుల ద్రపాలీలాన్యసందర్శన
భ్రూలాస్యంబుల మంజువాజ్మధుధునీపూరాప్లుతిన్ బూరుషున్
లోలుంజేసి మృషాప్రతిజ్ఞల సతుల్ లోభంబు బుట్టించి దు
ర్లీలం బ్రీతిని జూపి చేయరె నిజక్రీడాశకుంతబుగన్.
"దేవవ్రత.1 - 30"
ఈకావ్యమున మూడవయాశ్వాసములో జామదగ్న్య భీష్ముల కొక సంభాషణ మున్నది. అచట గొన్నిపద్యములు ప్రబంధపద్ధతిని గాక నాటకపద్ధతిని రచింపబడినవి.
భీష్ముడు:- మేలా యీసంరంభము
హేలానంతర్జితావనీశ్వర ! నీకున్
జామ:- బాలామణి గైకొనుమీ
భీష్ముడు:- వాలాయయు సేయనౌనె భార్గవ ! చెపుమా.
ఈ రకపు సంభాషణము నాపుడు, అనపుడు ఇత్యాది పద విరహితముగా బ్రబంధములలో నున్నట్లు కానము. ప్రవరసేన మహాకవి ప్రాకృతమున రచించిన సేతుబంధమహాకావ్యము వీరు తెనుగున రచించిరి. పాకృతమున గూడ నీయాచార్యకవికి మంచిపాండిత్యమున్నది. సంస్కృతమున మహామహోపాధ్యాయులైనను బ్రాకృత మెఱుగనివా రెందఱోకలరు. వీరట్లుగాక ప్రాకృతము గురుముఖమున నభ్యసించి యందు కృషిచేసి 'ప్రాకృతభాషాత్పత్తి' యను గ్రంథము కూడ రచించిరి.
ఆచార్యులుగారు వ్రాసిన 'లౌకిక న్యాయవివరణము' ను ఆంధ్రసాహిత్యపరిషత్తువారు 1939 లో వెలువరించిరి. అందు 232 సంస్కృత సూక్తులు, న్యాయములు, ఆభాణకములు కలవు. ఇది విద్యార్థులకు----------బఠనీయమగు గ్రంథము.
భాషావిషయగ్రంథములు ప్రబంధములు వ్రాసి ------------------ విజయనగరము మహారాజాంగ్ల -------------------సంస్కృతో పాధ్యాయులుగా-
(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)