పుట:AndhraRachaitaluVol1.djvu/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'డిప్యూటీ తహసీలుదారు' గా చింతలపూడి, భీమవరము, క్రొత్తపేట, కదిరి, కడప మున్నగు తావుల నుద్యోగించిరి. సాధారణముగా, ప్రతి మానవునకు అభిప్రాయమొకటి - చేయుచున్నపని యొకటి యగుట జరుగుచున్నది. లక్ష్మినరసింహరాయకవికి స్వతంత్రతతో జీవింపవలెనని కాని, పరాధీనమైన సేవకవృత్తిలో గొట్టుకొనవలెననికాని తలపులేదు. కాని తప్పలేదు. 1912 సం.వఱకు తెలుగునేలలో బలుప్రాంతములు పర్యటించి 'డిప్యూటీ తహశ్శీలుదారు'గా బనిచేసి ప్రజలయాశీస్సులకు, అధికారుల యామోదమునకు బాత్రుడై, గౌరవవేతనము పుచ్చుకొనెను. ఉద్యోగమునుండి విరమించిన 1912 మొదలు, ఇరువదినాలుగేండ్లు వీరుజీవించిరి. ఈయిరువది నాలుగేండ్లును సారస్వత సేవకై వినియోగపడినవి. సేవావృత్తిని తూలనాడుచు 'భోజకుమారము' లో వ్రాసిన వీరిపద్య మిది:

సీ. చందమామను మించునందంబు గలదాని

జీ! కురూపినిగాగ జేయుదాన

అలనుమేరువునైన నడగించు దిట్టరి

జీ! పదగాగను జేయుదాన

ఉక్కుమీఱి నురేంద్రు లెక్క సేయనివాని

జీ! యస్వతంత్రుని జేయుదాన

అల దేవగురునోర్చు నతిబుద్ధిశాలిని

జీ! బుద్ధిహీనుని జేయుదాన

గీ. అల్ల సత్యహరిశ్చంద్రు నట్టివాడు

చెప్పు నిజమును జీ! బొంకు సేయుదాన

అవనినోనేవ! కటకటా! యక్కటకట!

కలదె? నీచేయలేని యకార్యమొకటి.

ఈనాటకమున సేవానైచ్యము - అధికార మదాంధత - నిరర్థ బిరుదప్రదానము - మున్నగునవి పేర్కొని, వానిని నిరసించిరి.

1905 తరువాత నీకవి భగవద్గీత - ననత్సుజాతీయములు తెలిగించిరి. భారతమున నుద్యోగపర్వమును వీరాంధ్రీకరించిరి. గాని, యది నేటి