పుట:AndhraRachaitaluVol1.djvu/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తాడూరి లక్ష్మీనరసింహరాయకవి

1856-1936

మధ్వమతస్థులు. తల్లి: సీతమాంబ.తండ్రి: రామారావు. నివాసము: రాజమేంద్రవరము. జననము: 18-7-1856 సం. నల సంవత్సర - ఆషాఢ బహుళ ప్రతిపత్తు - శుక్రవారము. నిర్యాణము: 4-7-1936 సం. ధాతృ సంవత్సర - ఆషాఢ శుద్ధ పూర్ణిమ.

కృతులు: 1. శృంగారభూషనము. 2. ఉన్మత్తరాఘవము. 3. రుక్మిణీ స్వయంవరము. (ఈ మూడు నాటకములు) 4. భోజకుమారము. 5. లక్ష్మీసంవాదము. 6. చంద్రాలోకము. 7. మేఘసందేశము (పూర్వసర్గముమాత్ర మాంధ్రీకృతము) 8. దైవప్రార్థనము. 9. భగవద్గీత (ఆంధ్రీకృతి). 10. శృంగారతిలకము. 11. ఋతుసంహారము. 12. జ్ఞానోదయము (ఆంగ్ల అణు కావ్యముల ఆంధ్రీకరణము). 13. సనత్సుజాతీయము. 14. నీతికథానిధి. 15. రసమంజరి (సంస్కృతమునకు తెలుగుసేత). 16. చమత్కారచంద్రిక. 17. పండితరాయ శతకము. 18. ఉద్యోగపర్వము (తెలిగింపు) 19. బాలనీతి - ఇత్యాదులు.

నాటిరాజమహేంద్రవరము - నేటిరాజమహేంద్రవరము కవులను బెంచుచున్న చక్కని పట్టణము. రాజరాజనరేంద్రుని మొదలు నేటిదాక, ఆపుర మొకేతీరున గవులకు గాపురము.

శ్రీవీరేశలింగముగారితో పాటు, శ్రీ సుబ్బారాయుడుగారితోపాటు, వాసుదేవశాస్త్రిగారితోపాటు, లక్ష్మినరసింహంగారితోపాటు రాజమహేంద్రవరమున గొన్నాళ్ళు నివాసమున్న కవులలో తాడూరి లక్ష్మీనరసింహరావుగా రొకకవి. ఈయనకు కవిగా బేరున్నదిగాని, వాస్తవమునకు రాజకీయోద్యోగి. ప్రభుత్యోద్యోగులై తెలుగు సాహిత్యమును, గవిత్వమును సేవించినవారు మనవారిలో బెక్కురు. జయంతి రామయ్యపంతులుగా రాజాతిలోవారు. ప్రకృతము మన తాడూరి లక్ష్మినరసింహరాయకవి విషయము పరిశీలింతము. ఈయన