ణము వెనుకను కన్పించుటచే జదువుట కింపు పుట్టించుచుండును. ఇందు నాయకుడు చిత్రసీమ ఈపేరులో నొకవిచిత్రము. సీమ నకారాంతము, ఆకారాంతము కూడ నుండుటచే స్త్రీత్వపుంస్త్వవ్యవహారముల కీపేరే యుపయోగించెను. ఇది యవశ్యపఠనీయకావ్యము. తెలుగుపలుకుబడి కొకమచ్చు.
క్రొవ్వుమెఱుంగుగ బ్బొలయు గుజ్జగుమేనులతోడ నోరగా
దువ్వి శిఖల్ లతల్ ముడిచి దొడ్డగు నిత్తడిపోగులం జెవుల్
గవ్వల పేరుల న్నుదురుగప్పగ వంకరబొట్లు దిద్ది పై
గువ్వలవన్నె చేలమిడి కొందఱు చెంచులు వచ్చి కొంకుచున్.
చిత్రసీమ. -----
తెలుగుననేకాక సంస్కృతమునను వీరి కవితాధార ధారావాహిని. వీరి 'శంబరాసురవిజయచంపువు' చదివితీరవలయును. అందలి కవిత్వ మిటులు ప్రహించును.
నిర్మంజీరస్వన మవచనం నన్న కాంచీనినాదం
పశ్చా దేత్య ప్రియతమదృశా వంబుజాక్షి సిధాయ
కాహం బ్రూహీ త్యభిహితవతీ కంకణానాం విరావై
ర్జాతా నద్య: పులకితలసద్గాత్రయష్టి ర్బభూవ.
వైదార్భ్యాదినురీతి శ్చైకావళ్యాద్యలంకృతిప్రఖ్యా
నుకుమారత్వాదిగుణా రసికమనో హరతు కాన్యకన్యా మే.
పరమనైష్ఠికుడై, పండితశ్రేష్ఠుడై, కవిగరిష్ఠుడై చనిన భద్రాద్రిరామశాస్త్రిగారి కృతులు చిరకాలము తెలుగుపుడమి నిలువగలవనుటకు సందేహములేదు. పోతనవలె, కూచిమంచి కవివలె దనకృతులు భగవచ్చిహ్నితము లొనర్చిన మహావుణ్యు డీయన. ఈకవి తనవిషయమును శ్రీరామస్తవమున లగింపజేసి వ్రాసిన యీపద్యము చూడుడు;