గురజాడ శ్రీరామమూర్తి
1851 - 1899
నియోగిశాఖీయ బ్రాహ్మణులు. తండ్రి: దుర్గప్రసాదరావు. నివాసము: కాకినాడ, విజయనగరము. జననము 1851. నిధనము 1899. గ్రంథములు: 1. చిత్రరత్నాకరము 2. కళాపూర్ణోదయ కథా సంగ్రహము 3. కవిజీవితములు 4. కలభాషిణి 5. తెనాలి రామకృష్ణుని కథలు 6. అప్పయదీక్షిత చారిత్రము 7. తిమ్మరుసు చారిత్రము - ఇత్యాదులు. రాజయోగి పత్రికా సంపాదకత్వము.
గురుజాడ శ్రీరామమూర్తి గారికి బూర్వము తెనుగున గవి చరిత్రములు లేవు. వీరాంగ్ల విద్యాధికులు గాన బాశ్చాత్య విద్వాంసులు రచించిన కవి జీవితములు చూచి యట్టిది యాంధ్రమున సంధానించిరి. ఆంద్ర కవి జీవితములు కథా ప్రధాన మయిన గ్రంధము. అందు కవి కాల నిర్ణయాదుల కంటె నా యా కవులపై జెప్పుకొను పుక్కిటి పురాణము లెక్కువ. చారిత్రక దృష్టితో బరిశీలించిన నీ గ్రంధమునకు బ్రథమ స్థానము లేకున్నను గవి చారిత్రముల కిది మార్గ దర్శి యనవలయును. కందుకూరి వీరేశలింగము పంతులు తమ 'కవులచరిత్ర ' లో మఱుగున నున్న కవులను బెక్కుమందిని బయట బెట్టి వారి వారి కాల నిర్ణయములు సప్రమాణముగా నొనరించి తత్తద్గ్రంథములలోని గుణ దోహములు వెల్లడించిరి. ఆ కారణమున వీరి కవి జీవితముల కంటె, వారి కవి చరిత్రములకు బెద్ద పేరు వచ్చినది. 1880 లో కవి జీవిత రచనము వీరిది సాగినది. రామ మూర్తి పంతులు గారి పీఠికలోని కొన్ని మాటలు పరికింప దగినవి.
"................ కందుకూరి వీరేశలింగము గారు తమ మిత్రు లెవ్వరో తమ్ము గవి చరిత్రములు తిరుగ రచియించుటకు బ్రేరేపించినారని కవి చారిత్రము లను పేరితో నొక గ్రంథము ప్రాచీన కవులం గూర్చిన భాగమును ముద్రించి ప్రకటించిరి. అందు పెక్కండ్రు కవుల పేళ్ళును వారి చారిత్రములను