నడిపించిరి. ఇంతియేకాని ఇతిశ్రీ గా గద్యము గలగ్రంధములు 17 వ శతాబ్దిలో మధురా పరిపాలకుడైన విజయగంగ చొక్కనాధుని కాలము నుండి కాని బయలు దేఱలేదు. మధురాంద్ర వాజ్మయములో బుట్టిన వచనరచన లన్నియు బౌరాణిక గాధాగ్రధితములు. పోనీ, కృష్ణమిశ్రుని ప్రబోదచంద్రోదయ నాటకమును నంది మల్లయ్య, ఘంట సింగన కవులు ప్రబంధముగా మార్చిరిగాని నాటకము నాటకముగా నాంధ్రీకరింపలేదు. "విద్దసాల భంజిక" ను మంచనకవి "కేయూరబాహు చరిత్ర" కావ్యముగా మార్చెను. ప్రాచీనాంధ్రకవులకు వచనములపై గల యుపేక్షాభావమున కిది నిదర్శనము. క్రొత్త తీరుగల చిన్నయసూరి "నీతిచంద్రిక" తెలుగున మొట్టమొదటి వచనగ్రంధము. చిన్నయ్యసూరి వేసిన వచన వాజ్మయబీజమును వీరేశలింగం పంతులుగారు మొలపించి వెలయజేసిరి. వీరేశలింగముగారి రాజశేఖరచరిత్రకు గోపాలకృష్ణమసెట్టి "రంగరాజుచరిత్ర" తో బోలికలు గలవని యొకరు చూపించిరి. అగుగాక! తిక్కన కవిబ్రహ్మ యనునట్లు పంతులుగారు గద్యబ్రహ్మ. సూరి నీతిచంద్రిక తరువాత సుప్రసన్న భాషలో వీరేశలింగముగారు సంధివిగ్రహములు వ్రాసిరి. వీరిశైలి సుమధురము సులభమునై సర్వజనగ్రాహ్యముగా నుండును. సంధులచ్చ టచ్చట సడలించినను రచనలో మాధుర్యమునుమాత్రము తొలగించలేదు. అన్య దేశములు కొన్ని యుపయోగించినను నందము చెఱుపలేదు. ప్రజాసామాన్యమున కర్ధము కావలయుననియు సంఘసంస్కార ప్రచారార్ధమనియు వీరిశైలి తేలిక పఱుచుకొనిరి. వీరి రాజశేఖరచరిత్రము, సత్యరాజా పూర్వదేశయాత్రలు ఆంగ్లేయరచనలకు ఛాయలైనను స్వతంత్ర రచనములవలె నుండి నవలలకు దారి చూపినవి. వీరేశలింగము పంతులుగారు వచనములో నొకవిలక్షణత వెలయించిరి.
ఇక నాటకముల మాట యోచించినచో నివి యింతకు బూర్వము తెలుగున లేవు. యక్షగానములుమాత్ర మున్నవి. కాళిదాసకృత