పుట:AndhraKavulaCharitamuVol2.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. నిన్ను జెఱగొన్న హైహయు
   కన్నన్ దోర్వీర్యమెక్కుడగుభార్గవు లీ
   ల న్నిర్జించినరామున
   కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే?

9. శేషధర్మములు-


క. పెట్టడు నారకమార్గం
   బెట్టి మహాక్రూరకర్ము డేనియు దుద ని
   ట్టట్టనక నెమ్మనంబున
   నెట్టన హరి దలప గలిగెనేని మహాత్మా.

10. విజయసేనము-


ఉ. వల్లభు డేగు దుర్లభుడు వానిదెసందగు లూది యిమ్మెయిన్
   దల్లడ మందెదేల యుచితస్థితికి న్నను బాప జూచినన్
   దల్లియు బంధులోకమును దండ్రియు నేమనువా రెఱింగరే
   మల్లమ యిట్లునీకు దగునో తగదో పరికించిచూడుమా.

11. దేవీవిజయము-


గీ. వాక్త్రిణేత్రాంగనాశచీశక్తు లధిక
   సంభ్రమంబున గుంభనికుంభదైత్య
   హంత్రి బూజింపుదురు త్రయీమంత్రములను
   స్తోత్రములుచేసి మంగళారాత్రికలిడి.

12. మధుసేనము-


క. పో నుద్యోగము చేసిన | ప్రాణంబా యింకనీకు బాథేయం బీ
   మానినిమందస్మితమధు | రాననచంద్రికలు గ్రోల నరుగుము పిదపన్.

13. అనిరుద్ధచరిత్రము- కనపర్తి యబ్బయామాత్యప్రణీత మయిన యీపేరుగల యాధునిక ప్రబంధమొకటి కలదుగాని యీక్రింది పద్యము పూర్వగ్రంథములోనిది-