చ. నెలవుల నుప్పతిల్లి సరినిక్కి మొన ల్తల లెత్తి క్రొవ్వి లో
బలిసి సమంబులై బిగిసి వట్రువలై మెఱు గెక్కి చక్కనై
కెలకుల బిక్కటిల్లి చెలికిం గడునొప్పె గుచంబు లొప్పుకు
ప్పలుగను మన్మథుండు సరి వా లగ ద్రాసున దూచెనోయనన్.
14. శూద్రకరాజచరిత్రము-
మ. సమడేభారి మసంగిపై నుఱికినన్ శంకించి భూపాలు డో
లము గన్నం గని దాని శూద్రకుడు లీలంద్రుంచె నె నప్పు డ
త్యమలో ద్యత్ప్రసవార్థిత కుసుమగంధఘ్రాణలుబ్ధభ్రమ
త్భ్రమరభ్రాజితపాటలీనిటపమధ్యస్ఖుండ నై చూచితిన్.
15. ఆదినారాయణచరిత్రము-
ఉ. శ్రీయుతలోచనోజ్జ్వలమరీదులు భానుమరీచినిస్ఫుర
త్తోయజకాంతితోడ దులదూగెడుపచ్చనిపట్టు గట్టి య
త్యాయతశంఖచక్రరుచిరానిగదాధరు డేచదెంచె నా
--యణు డా రరక్షణపరాయణు డాకరిరాజుపాలికిన్.
16. పంచగాణవిలాసము-
క. నిత్తంబుల రంజిల్లుచు
ము-దుప లపుడు గదిసి పూనిలునకున్
బిత్తరికి బలు---గుల
నిత్తిరి హారతులు పౌరులెల్ల --లంగన్.
17. ప్రద్యుమ్నోపాఖ్యానము-
<poem>
క. పంచశరుం డపు డని చా
లించి మహాప్రధనభూమి నీక్షించి మనో వంచితుడై శంఖము పూ రించెం గులగిరులు దిక్కరివ్రజ మదరన్.