పుట:AndhraKavulaCharitamuVol2.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మనాహ్వయు సత్కవితాధురీణు

దాంతు శతలేఖినీసురత్రాణబిరుద

కలితు నను వేడ్క బిలిపించి కరుణమీఱ

దేనియలుగుల్క నిట్లని యానతిచ్చె.


మ. శతలేఖిన్యవధానపద్యరచనాసంధాసురత్రాణచి

హ్నితనామా చరికొండధర్మసుకవీ నీవాగ్విలాసంబు లా

శితికంఠోజ్జ్వలజూటకోటరకుటీశీతాంశు రేఖాసుధా

న్వితగంగాకనకాబ్జనిర్భర రసావిర్భూతమాధుర్యముల్.


గీ. కావున విచిత్రగతి నలంకారసరణి

మీఱ రసములు చిప్పిల మెప్పు లొసగ

దెనుగు గావింపు నాపేర ననఘసుకవి

ధీరు లరుదందగా జిత్రభారతంబు.


పై పద్యములనుబట్టి వైష్ణవభక్తుడనియు, శతలేఖినీసురత్రాణబిరుదము గలవాడై శతలేఖిన్యవధాన పద్యరచనయందు సమర్థు డనియు, తెలియవచ్చుచున్నది. కృతిపతియైన పెద్దనమంత్రి మాదనకుమారుడు; నియోగిబ్రాహ్మణుడు; కాశ్యపగోత్రుడు. అతడు మానభూనాధుని మంత్రియైన ట్లీక్రిందిపద్యములలో జెప్పబడియున్నది-


సీ. అనువత్సరరీబుబ్రాహ్మణులకు గోసహస్రము లిచ్చు నృగనరేశ్వరునిరీతి

కంధులనెనయు పాకాలచెర్వాదిగాదగు చెఱువులు నిల్పు సగరుకరణి

దీవ్యత్ప్రతాపుడై దిగ్విజయంబు గావించు మాంధాతృభూవిభునిలీల

దేవభూదేవతార్థిశ్రేణి కగ్రహారము లిచ్చుభార్గవరాముపగిది

నిందు శేఖరపాదారనిందయుగళ

భావనాపరు డంగనాపంచబాణు

డతులధైర్యాభిభూతహిమాచలుండు

మానభూనాథ చిత్తాబ్జభాను డతడు.