పుట:AndhraKavulaCharitamuVol2.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అను పద్యమువలన నత డితరులకవిత్వమందలి గుణములను గ్రహించి శ్లాఘించు గుణగ్రహణపారీణు డనియు స్పష్టపడుచున్నది.


తెనాలి రామకృష్ణుని యిందుధరోపాఖ్యానములోనిదని,

మ. ఒకనా డిందుధరుండు బార్వతియు లీలోద్యానకేళిసరి

న్నికటానేకవనప్రదేశముల దైతేయేంద్రకన్యాప్సరో

నికురుంబంబులు పారిజాతకుసుమానీకంబు పై జల్ల ద

ర్పకబాణంబుల కెల్ల నెల్లయగుసౌభాగ్యంబు శోభిల్లగన్.


అనెడి యీపద్యము రంగరాట్చందమునం దుదాహరింపబడి యున్నది. అప్పకవి యీపద్యమునే యాదిపురాణములోనిదని యుదాహరించి యున్నాడు. ఆదిపురాణమును, ఇందుధరోపాఖ్యానమును వేఱు వేఱు గ్రంథములలో, ఒక్క గ్రంథమునకె రెండును వేఱువేఱు పేరులో, మా కాగ్రంథములు లభింపకపోవుటచేత మే మిప్పుడు చెప్పజాలము. ఈపద్యము సోముని హరివంశములోనున్నది. కాబట్టి యిది పై రెండు గ్రంథములలోను దేనిలోనిదియు గానట్టు తోచుచున్నది. ఈకవి యొక్క పాండురంగమాహాత్మ్యములోని కొన్నిపద్యముల నుదాహరించి యీతని చరిత్రము నింకటితో మగించుచున్నాము:-


మ. బొమలెక్కించిన విల్లువంచు నునుజూపు ల్చంచలాచంచల

క్రమరేఖ న్నిగిడింప శాతవిశిఖౌఘంబుల్ మెయిన్నించు నె

య్యమునన్ బల్కగ నల్కమీఱి చటులజ్యాఘోషముంజేయు స

య్యుమప్రా పొంది రతీశ్వరుండు హరు బిట్టోడింప నుట్టాడుచున్. [ఆ.1]


చ. హరిహయదేశికాభు డగునమ్మహిదై వతమౌళియందు బం

గరువునకున్ మృగీమదసుగంధము సంధిలుభాతి నంబుజో

దరచరణారవిందసతతస్మృతిలోలుప యైనబుద్ధియున్

బరిణతి గాంచెసంపదలపై మఱియుం జనియించు సంపదల్. [ఆ.2]