పుట:AndhraKavulaCharitamuVol2.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. అట్టి పెదతిమ్మరాజు ధైర్యాద్రిరాజు

మంగవిభుగుర్వశౌరియనుగు గూతు

సంగనాశిరోమణి బాపసంగమాఖ్య

బ్రేమవరియించె విభవాభిరాము డగుచు.


క. గుణనిధి యగుతత్కన్యా

మణిజనకుంబోధజనకు మంజులభాషా

ఫణివరు రణవిజయార్జును

బ్రణుతింప దరంబె గురువపార్ధివనర్యున్.


సీ. పృథులవిక్రమశాలి పెదసంగనృపతియు సత్యసంధుడు చినసంగరాజు

ధర్మగుణాడ్యుండుతమ్మభూపాలుండురుచిరకీర్తిధనుండు రుద్రఘనుడు

ప్రథనాంగణకిరీటి బసవనరేంద్రుండుస్థిరభాగ్యనిధి పెద చిట్టఘనుడు

సింధుగాంభీర్యుండు చినచిట్టవర్యుండు సతతధన్యుడు పొట్టిసంగశౌరి


కలితతేజుండు పాపసంగప్రభుండు

ననగ బరగినతొమ్మండ్రు తనయవరుల

గాంచి విజయసంశీలుడై మించె నౌర

మంగరాజన్యగురువసమ్రాడ్వరుండు.


క. ఆగురువరాజవరునకు|ద్యాగసముద్రునకు నల్లుడయి వెలసె ధరా

భాగధురంధరతను నా | భాగుడు పెదతిమ్మరాజు ప్రజలు నుతింపన్.


కృతిపతితల్లియు మంగయగురువ రాజుకూతురు నైన పాపసంగమాంబ పెదసంగభూపాలాదులగు తొమ్మండ్రుకును జెల్లె లయియుండ వచ్చును. అట్లయినచో నీమె సంగభూపాలునికంటె నిరువది యిరువదియైదేండ్ల చిన్నది కావచ్చును. కృతిపతియైన వేంకటరా జీమెయేడుగురుపుత్రులలో మూడవవాడు. కాబట్టి యితడు తల్లి కించుమించుగా నిరువదియైదువత్సరములప్రాయమునందు జనించి యుండ వచ్చును. అందుచే నీవేంకటరాజు తనమేనమామ యగు పెదసంగ