పుట:AndhraKavulaCharitamuVol2.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యవచ్చుచున్నది. పాండురంగ మాహాత్మ్యకృతిపతియగు విరూరి వేదాద్రి కాశ్రయుడగు పెదసంగభూపాలుని మేనల్లునికి రెట్టమతము నంకితమొనర్చిన యాకవులు తమకాలము నీక్రిందిపద్యముచే దెలిసికొనియున్నారు.


సీ. కలియుగప్రథమభాగమునాల్గువేలయెన్మిదినూర్లపైని డెబ్బదియునొకటి

శాలివాహనశకసమలిలవేయునార్నూటతొంబదిరెండు రూడిగా గ

బ్రభ వాదిగతములు పరగ నిర్వదిమూడు నేండ్లయ్యె నెంతయు నెన్నబుధులు

అట్టికాలంబున నయ్యల భాస్కర కవివర్యు లలరాజక మలహితుని


యాజ్ఞ బూర్వోక్త రెట్టమతాఖ్యకావ్య

మునునొనర్చిరి యాచంద్రముగను గీర్తి

వక్తృశ్రోతలకునుగల్గ వసుధమీద

నలయహోబల నృహరికి నర్పణముగ


సంగభూపాలుని యనుగ్రహవలన వేదాద్రిసంపదల నొందినట్లు


గీ. గుఱుతుగలరాజు మంగయ గురువరాజు

పుత్రు బెదసంగభూపాలుశత్రుజైత్రు

భానుసమతేజు విద్యావధానభోజు

గొల్చి వేదాద్రి నిత్యాలక్ష్ముల దలిర్చు.


ఇత్యాది పాండురంగమాహాత్మ్యములోని పద్యములు చెప్పుచున్నవి. పెదసంగభూపాలుడు గురువరాజుయొక్క తొమ్మండ్రుపుత్రులలో జ్యేష్ఠుడు. ఈతని తమ్ములనామము లాగ్రంథమునందు జెప్పబడి యుండకపోవుటచేత గ్రంథరచనకాలమునకు వారు బాలురనియు సంగభూపాలుడు యౌవనదశయం దుండినవా డనియు స్ఫురించుచున్నది. పెదసంగభూపాలుని తమ్ములనుగూర్చి రెట్టమతములో గృతిపతియొక్క తండ్రి యగుపెదతిమ్మరాజును వర్ణించుసందర్భమున నిట్లు చెప్పబడినది.