పుట:AndhraKavulaCharitamuVol2.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిష్యుడు. ఈతనికవిత్వము నిర్దుష్టమయిన హృదయంగమముగానున్నది. కాకుస్థవిజయములోని కొన్నిపద్యముల నిందు బొందుపఱుచుచున్నాను.


ఉ. మనుతనయుండు నంతట సమాధిసమాపనవేళయైన లో

చనములు విచ్చి ముందట బ్రసన్నపరిస్ఫుటబింబ మొప్ప ని

ల్చిననెల నిల్వుటద్దమువలెన్ మెఱయంగ మరుండు మాధవుం

డును నునుగాడ్పు మేనులకు నోచగ నచ్చర లాట లాడగన్. [ఆ.1]


చ. కలువలవిందున క్తమును గమ్మకొలంకులగాడ్పుక్రుంకు జె

ల్వలజడలున్ వసంతువనవాసము గ్రొవ్విరికత్తికోతలున్

వెలసిన నాదుమాధుకరవృత్తి విశిష్టగుణంబు నెంచియో

చెలిమియు బ్రేమయు బొదల జేసె మహాముని యాతిథేయముల్. [ఆ.2]


ఉ.నీ విదియెక్కి పద్మభవనిర్జరనాథుల జూడ నెప్పుడుం

బోవుచు వచ్చుచుండి పనిపుట్టిన వేల్పుల పాలగల్గి చే

చేవయొకింత చూపు మని చెప్పి తిరోహితు డయ్యె నయ్యెడన్

దైవతలోకశిల్పి యరదం బటువెట్టి మహాద్భుతంబుగన్. [ఆ.2]


చ.పుడమికి నీవు రాజ వయి పుట్టితివెన్నడు నాటనుండియున్

గొడవలు గట్టిపెట్టి నిను గొల్చిరి రాజులు కన్నుదోయికిన్

బడలిగాక యేకలహపారణ గఱ్ఱున ద్రేచెదన్ వ్యధం

దడవులబట్టి చూడనికతంబున మాసెజుమయ్య వీణయున్. [ఆ.2]


ఉ. వేల్పులకంటె ము న్నసురవీరుల మేము సృజించుటెంచి స

కల్పము మాప్రసన్నతకుగా నొనరించితి నన్న వీవచ:

కల్పన కర్థ మేమి యలకయ్యము మాకు ననిష్టమంచునో

యల్పుల ద్రుంచి లోకములయాపద దీర్చితి వింతయొప్పదే. [ఆ.3]


ఉ. వచ్చిన నిచ్చట న్మొలచి వచ్చితిరే యన నోల లాడుచున్

వచ్చితి మమ్మ యేము నొకవారిరుహాకరవీధి నీజటా