పుట:AndhraKavulaCharitamuVol2.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. మహి నీపుత్రు డనంతుడ

బహుమహిమం జెప్పనేర్చు భమౌళిధునీ

లహరీఘుమఘుమితవచో

మహితముగా నెల్ల శౌర్యమాయాభిల్లా.


ఈకవి పూర్వులలో వరదరాజను నతడు కృష్ణదేవరాయని కల్లుడైనట్లు కవి యీక్రిందిపద్యమున జెప్పియున్నాడు-


చ. వనజదళాక్షశంకరులు వార్ధికి నద్రికి బోలె గృష్ణరా

యనికి ననుంగుటల్లు డటులై తనరున్ వరదక్షమాధవుం

డనిమిష వాహినీమునిగజాశ్వమహీరుహధేనుభీమవా

హనమకుటావతంసకుధరాభరణాదిక హేతుకీర్తియై.


కవి తనతండ్రిని,


ఉ. ఎక్కడ గాన మెల్ల ధరణీశ్వరు హేతి కరాతి భీతిమై

నెక్కనిధారుణిధరము లేగనిదుర్గదిగంతరాళమున్

ద్రొక్కవికాననాంతరము దోగనిదివ్యనదీహ్రదంబులున్.

మ్రొక్కనిఱాలునుం దిననిమూలపలాశిపలాశజాలమున్.


ఇత్యాది పద్యములలో వర్ణించిన వర్ణననుబట్టి యతడు క్షత్రియుడగుటయేకాక భూపాలుడనియు దెలియవచ్చుచున్నది. తండ్రిమాత్రమే కాక కుమారుడైన యనంతభూపాలుడు గోలకొండ నవాబయిన యిబ్రహీముషాకాలములో రాజ్యపరిపాలనము చేయుచుండినట్లు చరిత్ర నిదర్శనములు కనబడుచున్నవి. కాబట్టి కవి 1550-80 వ సంవత్సర ప్రాంతములయం దుండినవా డయినట్టు తెలియవచ్చుచున్నది. ఈకవి సూర్యవంశజుడు; రంగాంబాపుత్రుడు; తిరుమల తోళప్పాచార్య