పుట:AndhraKavulaCharitamuVol2.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నామధేయు" ననియు తండ్రులను వేఱువేఱుగా జెప్పుటనుబట్టియు, వేఱువేఱు కవులయినట్టు పయికి గానవచ్చుచున్నను గొన్నిహేతువులను బట్టి రెండవపక్షమువారు చెప్పెడి యంశములుకూడ సావధానముగా విచారింపవలసినవిగా నున్నవి. ఉభయపక్షములవారును జెప్పెడుయుక్తులను జక్కగా గ్రహింపగలుగుట కయి వంశక్రమమును దెల్పెడు పూర్వోక్తము లయిన రెండు పద్యములను పూర్ణముగా నిందుదాహరించుట యావశ్యకమని తోచి యట్లు చేయుచున్నాను, మొట్టమొదట బుస్తకములను జదివినప్పు డిరువురుకవులును వేఱువేఱనియే నేనును నభిప్రాయపడినను రెండవవారి యుక్తులను విన్నపిమ్మట నా మనస్సునకు గొంత సందేహము కలిగినందున, ఏతన్నిర్ణయమును దీనిని జదువువారికి విడిచిపెట్టు గ్రంథసౌలభ్యము నిమిత్త మిందుభయుల నొక్కరినిగానే భావించి వ్రాసెదను. ఇరువురును భిన్ను లయినను కాకపోయినను చరిత్రభాగమునందు వేఱువేఱుగా వ్రాయవలసిన యంశము లేవియు గానబడవు.


1. సీ. శతలేఖినీపద్యసంధానధౌరేయు ఘటికాశతగ్రంథకరణధుర్యు

నాశుప్రబంధబంధాభిజ్ఞ నోష్ఠ్యనిరోష్ఠ్యజ్ఞ నచలజిహ్వోక్తినిపుణు

దత్సమభాషావితానజ్ఞ బహుపద్యసాధిత వ్యస్తాక్షరీధురీణు

నేకసంధోచితశ్లోకభాషాకృత్యచతురు నోష్ట్యనిరోష్ట్యసంకరజ్ఞ

నమితయమకాశుధీప్రబంధాంకసింగ

రాజసుత తిమ్మరాజపుత్ర ప్రసిద్ధ

సరస వేంకటరాయభూషణసుపుత్రు

నను బుధవిధేయు శుభమూర్తినామధేయు, సరసభూపాలీయము.


2. సీ. వనధిలంఘనకృపావర్ధితోభయకవితాకళారత్నరత్నాకరుండ

సకలకర్ణాటరక్షాధురంధరరామవిభుదత్తశుభ చిహ్నవిభవయుతుడ