పుట:AndhraKavulaCharitamuVol2.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామరాజుయొక్క యనంతరమున మాతామహార్జితమయిన విద్యానగరరాజ్యమునకు రావలసిన వాడు కృష్ణరాయని దౌహిత్రుడయిన కృష్ణరాజే యయినను, రామరాజు తమ్ములయిన తిరుమలదేవరాయలును వేంకటపతిరాయలును బలవంతు లయి యాతనకి దక్కనియ్యక యారాజ్యమును తామే యాక్రమించుకొని యేలసాగిరి.

మూర్తి యనియు రామరాజభూషణు డనియు నిద్దఱు వేఱువేఱుకవు లనియు నందు మూర్తికవి సరసభూపాలీయమును, రామరాజభూషణకవి వసుచరిత్ర, హరిశ్చంద్ర నలో పాఖ్యానములను రచియించిరనియు కొందఱును, ఇద్దఱు నొక్కరే యనియు మూర్తి యనునది నిజమనిపేరనియు రామరాజభూషణు డన్నది రామరాజుయొక్క సభ కలంకారముగా నుండుటచేత వచ్చిన బిరుదుపే రనియు నతడు సూరపరాజున కౌరసపుత్రు డయి తదగ్రజు డయిన వేంకటరాయభూషణునకు స్వీకృతపుత్రు డనియు మఱి కొందఱును జెప్పుచున్నారు. "శ్రీరామచంద్రచరణారవిందవందన పవననందనప్రసాద సమాసాదిత సంస్కృతాంధ్రభాషాసామ్రాజ్య సర్వంకష చతుర్విధకవితా నిర్వాహకసాహిత్యరసపోషణ రామరాజభూషణప్రణీతం" బని వసుచరిత్రములోని గద్యమొక విధముగాను "శ్రీహనుమత్ప్రసాదలబ్ధకవితాసార సారస్వతాలంకార నిరంకుశప్రతిభాబంధుర ప్రబంధపఠన రచనాధురంధర ప్రబంధాంక వేంకటరాయభూషణపుత్ర తిమ్మరాజపౌత్ర సకలభాషావిశేష నిరుపమావధాన శారదామూర్తి మూర్తిప్రణీతం" బని సరసభూపాలీయములోని గద్య మింకొకవిధముగాను నుండుటను బట్టియు, హరిశ్చంద్ర నలో పాఖ్యానములో "ప్రబంధాంక సింగరాజ తిమ్మరాజ ప్రియతనూజ ధీర సూరపాత్మజుడ రామనృపభూషణాఖ్య సుకవి" ననియు సరస భూపాలీయములో "ప్రబంధాంక సింగరాజసుత తిమ్మరాజపుత్ర ప్రసిద్ధ సరస వేంకటరాయభూషణసుపుత్రు నను బుధవిధేయు శుభమూర్తి