పుట:AndhraKavulaCharitamuVol2.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణహిందూస్థానమునందు భామినీవంశీయతురష్క రాష్ట్రావసానదశయందు స్వతంత్రులయిన యయిదుగురు మహమ్మదీయ ప్రభువులలో నొకడయి గోలకొండ రాజ్యసంస్థాపకుడయి క్రీస్తుశకము 1512 వ సంవత్సరము మొదలు 1543 సం వఱకును రాజ్యముచేసిన కుతుబ్‌ షాకీయిబ్రహీము చతుర్థ పుత్రుడు. గోలకొండ రాజ్యస్థాపకుడయిన కుతుబ్ షా హిందువులను మాత్రమేకాక మహమ్మదీయులను సహిత మనేకులను జయించి తన రాజ్యమును వ్యాపింపజేసెను. ఆతని విజయములను గూర్చి తపతీసంవరణములోని యీ క్రింది పద్యము కొంత వివరించుచున్నది-


సీ. పడమటను సపాయి బసవని గాజేసి

యచట గొయ్యలకొండ నావరించె

దమదిమల్లాఖాను దక్షిణంబున గొట్టి

హరియించె బానుగ ల్లాదిగిరుల

నుత్తరంబున బరీదోడి పాఱగ దోలి

మెతుకుదుర్గం బాక్రమించి మించె

బ్రథమదిక్కున నొడ్డి పాత్రసామంతుల

ధట్టించి కంబముమెట్ట గొనియె

నతని బొగడంగ దగదె యాచతురసీతి

రూడిగిరిదుర్గలుంఠనప్రౌడతేజు

వాహశిఖరాధిరోహ రేవంతమూర్తి

కుతుబుశాహినిక్ష్మాపాలు గుణవిశాలు.


అయినను కృష్ణదేవరాయలు క్రీస్తుశకము 1516 వ సంవత్సరమునందు తెలుగుదేశమంతయు జయించి, ఓడ్రరాజులయిన గజపతుల కొమార్తెను తాను వివాహ మాడుటచేత తత్సంబంధమునుబట్టి రాజమహేంద్రవరము ప్రధాన నగరముగాగల యాంధ్రదేశమునంతను గజ