పుట:AndhraKavulaCharitamuVol2.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖలసంఘాతధరాపరాగపటలాక్రాంతంబు మిన్నే రవ

ర్గళభేరీరవనిర్దళద్దగన రేఖా లేపపంకాకృతిన్.


అని చదువగా మెచ్చుకొనెననియు చెప్పుదురు. ఈ కథ యెట్టిదైనను సూరన కృష్ణదేవరాయని తరువాతికాలపువా డైనట్టు స్థిరపఱచు చున్నది. అల్లసాని పెద్దన కృష్ణదేవరాయని యనంతరమం దనగా 1530 వ సంవత్సరమునకు తరువాతకూడా జీవించియున్నందున, సూరనార్యు డల్లసాని పెద్దన్న మనుమరాలి మగడయినను కావచ్చును. కళాపూర్ణోదయమును రచింపకపూర్వమునం దీకవి యాకువీటిరాజుల వద్ద మొట్టమొదటనుండి రాఘవపాండవీయమును జేసి వారి కంకితము చేయుటచే రాఘవపాండవీయము నీకవి 1550 వ సంవత్సర ప్రాంతములయందు మంచి పడుచుతనములో రచియించియుండును. ఇంతకు బూర్వపుదైన గారుడపురాణము బాలకవిత్వ మగుటచే నశించినదేమో! తిక్కన సోమయాజికి తరువాత నింత ప్రౌడముగా కవిత్వము చెప్పిన తెనుగుకవి మఱియొకడు లేడు. ఈ సూరన కావ్యరచనయందు సర్వతోముఖ చాతుర్యము కలవాడు. ఈతని కవిత్వము మృదుపదగుంభితమై ద్రాక్షాపాకముగా నుండును. ప్రభావతీ ప్రద్యుమ్నములోని యీ క్రింది పద్యమువలన నితడు గరుడపురాణమును, రాఘవ పాండవీయమును, కళాపూర్ణోదయమును, ప్రభావతీ ప్రద్యుమ్నమును, మఱికొన్ని గ్రంథములును రచించినట్లు కానబడుచున్నది.


మ. జనముల్ మెచ్చగ మున్రచించితి సదంచద్వైఖరిన్ గారుడం

బును శ్రీరాఘవ పాండవీయము గళాపూర్ణోదయంబున్ మరిన్

దెనుగుంగబ్బము లెన్నియేనియును మత్పిత్రాదివంశాభివ

ర్ణన లేమిం బరితుష్టి నాకవి యొనర్పంజాల వత్యంబునన్.


ఇందు పేర్కొనబడినవానిలో గారుడపురాణము మాత్రము మాకు లభించినదికాదు. రాఘవపాండవీయము క్లిష్టార్థములు లేకుండ