పుట:AndhraKavulaCharitamuVol2.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మృదుమధుర సులభపదములతో రామాయణభారతార్థములు వచ్చు నట్లుగా రచియింపబడిన శ్లేషకావ్యమును రచియించుట మఱియొకరికి సాధ్యముకాదు. ఈగ్రంథముయొక్క ప్రౌడిమను కృష్ణరాజు మెచ్చుకొన్నట్లుగా కవియే కళాపూర్ణోదయమునం దిట్లు చెప్పియున్నాడు-


మ. ఇటము న్గారుడసంహితాదికృతు లీవింపొందగా బెక్కొన

ర్చుట విన్నారము చెప్పనేల యవి సంస్తుత్యోభయశ్లేషసం

ఘటనన్ రాఘవపాండవీయకృతి శక్యంబే రచింపంగ నె

చ్చట నెవ్వారికి నీకె చెల్లె నది భాషాకావ్యముం జేయగన్.


కళాపూర్ణోదయము విచిత్ర మయినకల్పితకథను గలదై తెలుగు గ్రంథములలో నిరుపమానముగా నున్నది. సంస్కృతనాటకములలో మాత్ర మిటువంటి కథాచమత్కారము కానబడుచున్నదిగాని తెలుగులో నెక్కడను నింతవింతయైన కల్పితకథ మఱియొకటి కానరాదు. ఇది నాతికఠినమై మృదుమధుర శైలి గలదై యున్నది. ప్రభావతీ ప్రద్యుమ్నము చక్కని స్వభావోక్తులను గలదయి లలితఘటితమై కథాచమత్కృతి గలిగి చదువువారికి కర్ణరసాయనముగా నుండెడు ప్రౌడకావ్యము. ఈతడు రచియించిన పుస్తకములలో నిది కడపటి దగుటచే గవి దీనిని 1570 వ సంవత్సరప్రాంతముల యందు రచియించి యుండును. ఈకాలమునకే యీతడు వయసుమీఱినవా డగుటచేత దరువాత శీఘ్రకాలములోనే కీర్తిశేషు డయి యుండవచ్చును. ఈతని కవిత్వశైలి తెలియుటకై పైపుస్తకములనుండి రెండేసిపద్యముల నిందుదాహరించుచున్నాను.

రాఘవపాండవీయము

ఉ. హారిమృగవ్యనవ్యవిహితాదరు డాధరణీతలేశు డ

ధ్వార చితశ్రమాకలితుడై కడుమెచ్చె సురాపగాజలా