పుట:AndhraGuhalayalu.djvu/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నది. అంతేగాక అతనికి చండీశ అను బిరుదునిచ్చి తనతో సమానముగా అన్నిరకముల నైవేద్యములు ఇవ్వబడునని వరమిచ్చెడి వివరముకూడా 'థేవరం'నందు చెప్పబడియున్నది. ఈ గ్రంథ ప్రాచీనత కూడా చండీశ ఆరాధనా ప్రాచీనతను తెలుపుచున్నది.

చండీశుని శిల్పము మనకు పల్లవ రాజైన రాజసింహుని కాలమునాటి కైలాసనాధ దేవాలయమున మొట్ట మొదట అగుపడును. కాలక్రమమున చండీశ ఆరాధన ప్రచారమును పొంది చండీశునికి ప్రత్యేక దేవగృహాలు ఆలయప్రాకారాలలో 'ప్రణల'కు ఎదురుగా నిర్మించుట జరిగెడిది. తంజావూరు నందలి రాజరాజేశ్వర (బృహదీశ్వర) దేవాలయమునందలి చండీశ దేవగృహము మాత్రమే ఒకటవ రాజరాజు కాలమునకు చెందినది, మిగిలినవన్నియు తరువాత కాలమునకు చెందినవి. రాజరాజు చండీశుని పేరుతోనే ఆ దేవాలయ ఆస్తులుకూడా వ్రాయించి అతడే ఆలయ ఆస్తుల రక్షకుడుగా కూడా భావించినాడు. ఈ ఆచారము క్రీ. శ. 1118వ సంవత్సరమునాటి విక్రమచోళుని కాలమువరకు కొనసాగినట్లు తెలియుచున్నది. రాత్రిపూట ముఖ్యదేవుని పవళింపుసేవ కార్యక్రమము పూర్తయిన తరువాత ఆలయద్వారములు మూతవేసి తాళములు చండీశునివద్ద వుంచెడి ఆచారముకూడా వుండెడిది.

మొదటి రాజేంద్రుని కాలమున ఉత్తర భారతదేశముపై దండయాత్ర చేయబడి సాంస్కృతిక కలయిక ఏర్పడి నర్మదానదీ ప్రాంతమునుండి అనేకమంది శైవాచార్యులు దక్షిణదేశమునకు వచ్చిరి. దీనితో మరింత శైవసాహిత్యము వృద్ధిచెందినది. క్రీ. శ. 1158లో అఘోర శివాచార్యుడను గురవు 'క్రియా క్రమయోదిని' అను గ్రంథము రచించి అందు చండీశుని చతుర్ముల రూపముగూర్చి కూడా విశదీకరించినాడు. ఇతడు చండేశునికి ప్రత్యేక దేవగృహాన్నికూడా నిర్మించవచ్చునని తెలిసినాడు.

చండీశ ఆరాధన గంగై కొండ చోళపుర ఆలయమున మనము గుర్తించవచ్చును. మధురయందు ఆరాధనా రీతిలో చండీశుడు శిల్పమందగుపడును, చంగల్పట్టు దగ్గరలోని తిరుకాచూరు నందలి చండీశుడు చతుర్ముఖుడు. లేపాక్షియందు విజయనగర కాలమునకు చెందిన చిత్రలేఖనాలలో కూడా చండీశ అనుగ్రహమూర్తి గలడు. కాని మద్రాసు, పూనమలై మధ్య గల పోరూర్ నందలి చండీశ శిల్పము ఒక ప్రత్యేకమైనది ఇచటి రమణాదీశ్వర దేవాలయమున ఈ శిల్పము గలదు. ఇచటనే ఒకటన రాజేంద్రుని 'మెయ్ కీర్తి'గలదు, ఇది 'తిరుమన్ని వలర, ఇరు నీల మదంత్యం' అను పలుకులతో ప్రారంభమగుచున్నది, ఇచటి చండీశుడు ప్రత్యేకతను కలిగియున్నాడు. 'ఆసన' రీతిలో 'మఝు'ని కుడిచేతిలో ధరించి గుబురైన శిరోజాలు కలిగి, లావుపాటి 'యజ్ఞోపవీత'మున ధరించియున్నాడు. ఇవన్నియు పల్లవరీతిని తెలుపుచున్నవి. 'కౌపీనము' సంహార రూపమున యున్నాడు.

నందికేశ్వర:

భైరవకోన గుహాలయాల ప్రాంగణ మధ్యభాగమున శివుని వాహనమైన నంది ప్రతిమ (11 నుండి 22 వ చిత్రపటములు చూడుము) ప్రాంగణ కుడి, ఎడమలందు కోష్టములలో చండేశ, గణేశ (11 నుండి 22, మరియు 29, 30 వ చిత్రపటములు చూడుము)అర్ధశిల్పములు మనకగుపడును. ప్రతి శివాలయ గర్భగృహలోని శివలింగము లేక శివునికెదురుగా కొంతదూరములో శివుని వాహనమైన నంది లేక నందికేశ్వర (లేక అధికార నంది) ప్రతిమ ప్రతిష్ఠించుట సాంప్రదాయము. కావున భైరవకోన ప్రాంగణమందు గర్భగృహలోని శివలింగమునకు ఎదురుగా నంది ప్రతిమయున్నది. నందికేశ్వరునిగూర్చి భగవత్ పురాణము, రామాయణములందు ప్రస్తావించబడియున్నది. లింగపురాణ