పుట:AndhraGuhalayalu.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శరీరాన్ని (రక్తనిగ్రహం) కలిగియుండవలెనని చెప్పబడియున్నది. నాలుగు చేతులు కలిగి వాటిలో శూలము, పాశము, డమరు, కపాలము లుండవలెను, శునకవాహనుడై వుండవలెను నిరంబరుడుగా పిశాచములు, గణాలు చుట్టుముట్టబడి యుండవలెను. ఒక అద్భుత భైరవశిల్పము నెల్లూరు జిల్లా, వాకాడు తాలూకా, మల్లాం గ్రామంలోని సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయ కళ్యాణమండపమున కూడా గలదు. మల్లాంలోని భైరవుడు యువకుడుగా అభంగమున నిలచి, నిరంబరుడుగా వున్నాడు. నాలుగు చేతులు గలవు. కుడిచేతులలో డమరు, త్రిశూలములు. ఎడమ చేతులలో పాశము, కపాలములు గలవు. త్రినేత్రములు గలవు. శిరస్సు జటామకుట భూషణముతో వున్నది. ఇతడు చక్రకుండలములు, గ్రెమ్ వేయకలు, యజ్ఞోపవీతము, ఉదరబంధ, నాగకటి సూత, కడియాలు కంకణాలుగంటల దండలను కలిగియున్నాడు. ప్రక్క దంతములు, రౌద్రాకారము కలిగియున్నాడు. ఇతని వెనుక కొంత కుడివైపుగా ఒక శునకము గలదు. ఇది చాలవరకు "వటుకభైరవకల్ప"మందు చెప్పబడినట్లు చెక్కబడియున్నది. అనేక చోళ, విజయనగర భైరవ శిల్పాలు మనకు దక్షిణదేశమున అగుపడును. పటిపం, అండనల్లూర్, హ్రయంలలోను, శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వర, కాశీవిశ్వేశ్వర దేవాలయాలలోను, విజయనగర శిల్పకళకు చెందిన తాడిపత్రి, శ్రీశైలం ప్రాంతాలలోని శిల్పాలోను ఇట్టివే మన కగుపడును.

While writing about Bhairavamurti T.N.Srinivasan says : "Siva as the protector of the world is represented as a very fierce image with protunding eyes., and there will be long curved teeth in the mouth protruding out from the upper lip. He will be represented with strange ornaments like garlands of snakes and skulls and even in the head-dress skulls will be shown. There are as many as sixty four types of Bhairava Murtis, most of them having ghastly appearanced.

Bhairava is worshipped in many Siva temples outside the main shrine but he is an important deity with village communities for whom small shrines are dedicated in the localities where they live."

శ్రీనాధ మహాకవి తన క్రీడాభిరామ కావ్యమున (వీధి రూపకమున) తిప్పయ వల్లభుడు తనకు మూడు గ్రామములు సర్వభోగములుగా ఇచ్చి 'ములికినాటి' లోని 'మోపూరి'ని పాలించుచుండెనని వర్ణించినాడు. మోపూరు నెల్లూరు మండలములోని ఉదయగిరి సీమలోని దనుట జగద్విదితము. అక్కడనే భైరవాలయమున్నది తిప్పయ వల్లభు డా భైరవస్వామి భక్తుడట. పూర్వము భైరవునికి తిరునాళ్ళు వైభవముగా జరిగెడిదవియు,ప్రజలు తండోప తండాలుగా జేరెడువారనియు, అందు జనుల యానందమునకై ప్రాయికముగా నాటకము లాడబడెడివనియు అట్టి వాటిలో క్రీడాభిరామ మొక్కటనియు దెలియుచున్నది. ఆ కావ్యమున భైరవస్వామి ఇట్లు వర్ణింపబడినాడు.

సీ॥:చంద్ర ఖండములతో సరి వచ్చుననవచ్చు విమల దంష్ట్రా ప్రరోహముల వాని/

భవదంపుఁ గొనలతోఁ బ్రతివచ్చుననవచ్చు కుటిల కోమల జటాచ్చటల వాని/
నింద్రనీలములతో నెనవచ్చుననచ్చు కమనీయతర దేహకాంతి వాని/
నుడురాజు రుచులతో నొఱవచ్చుననవచ్చు చంచన్మ దాట్టహాసముల వాని॥

గీ॥: సిగ్గుమాలిన మొలవాని జఱుతవాని

నెల్లకాలంబు ములికి నాడేలు వాని
వర్ధి మోపూర ననతారమైన వాని
భైరవునిఁ చొల్వ వచ్చిరి భక్తులెల్ల (పీఠిక)