Jump to content

పుట:AndhraGuhalayalu.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండు స్తంభములు గలవు (22వ చిత్రపటం చూడుము). వీటిని 'చిత్రకంఠ' స్తంభములందురు. ఈ స్తంభ 'మూలము'లందు ఆసీన సింహాలు గలవు. ఈ సింహములపైన ఒక చతురస్రాకార కళానిర్మితమైన స్తంభ 'అండ' విభాగము కలదు. స్తంభము యొక్క 'కాపిటల్' విభాగము 'బేకిభైరవ' మరియు 'కుంభ', 'వీరకంఠ', 'పొటిక' విభాగములు కలవు ( 22, 31 వ చిత్రపటాలు చూడుము). వీటి 'కార్బెల్స్' సాధారణ వంపు గలిగియున్నవి. స్తంభాలపైన 'గణమాల'తో కూడిన 'దూలము' వంటి విభాగము కలదు. దీనిపైన 'కపోత' నిర్మాణము కలదు. కపోత ముఖభాగములందు పడగ గల నాగప్రతిమలు లేక మానవ తలలు మధ్యగల 'కూడు' డిజైన్లు గలవు. ఈ డిజైన్ల పైవిభాగాన సింహపు (వ్యాళ) తలలు గలవు. ఇది పశ్చిమ చాళుక్య శిల్పరీతిని చూపుచున్నది. ఈ గుహాలయ ప్రాంగణము నందు ఉత్తర,దక్షిణములలోని చిన్న కోష్ఠములందు గణేశ, చండేశ ఆర్ధశిల్పములు గలవు. శివలింగమున కెదురుగా ప్రాంగణాన నంది కలదు.

ఈ గుహాలయ పల్లవ,పశ్చిమ చాళుక్య, రేనాటి చోడుల శిల్పరీతి ప్రభావము కలిగియున్నది. ఈ విషయము కూడులపైనున్న పశ్చిమ చాళుక్యుల సింహపు తలలు. స్తంభములు మూలముల విభాగాన గల ఆసీన సింహములు తెలుపుచున్నవి. అంతేగాక ఇందలి సింహములు ప్రాంతీయ శిల్పరీతి ప్రభావమును కలిగియుండుట గమనార్హము. ఈ విషయము శిల్పములోని ముందుభాగ రూపణనుబట్టి తెలియుచున్నదని డా॥ బి. రాజేంద్రప్రసాద్ గారి అభిప్రాయము. ఈ గుహ 'కపోత' పైన సింహముల జంటల వరుస గలదు. ఈ గుహ ఆరవ గుహకు పైన ఉన్నది.

ఎనిమిదవ గుహాలయము:

ఈ గుహాలయము ఏడవదాని ప్రక్కనే వున్నది (21, 34, 36 వ చిత్రపటములు చూడుము). శిల్పశైలి యంతయు ఏడవదానిని పోలియున్నది. గర్భగుడి 5 అ॥ చతురస్రాకారముగా యున్నది. ద్వారపాలకులు ఏడవ గుహలయందువలె వున్నారు. ప్రాంగణము 12 అ॥ పొడవు, 4 అ॥వెడల్పు కలిగియున్నది. శాసనము కనిపించదు. అయినను ఏడవ గుహ కాలమందే నిర్మింపబడినట్లు చెప్పవచ్చును. ప్రాచీన పల్లవ శిల్పమును పోలియున్నది. ఏడు, ఎనిమిది గుహలు పరిమాణములో కొంత తేడా తప్ప మిగిలిన అన్ని అంశాలలో ఒకేరీతిలో యున్నవి.

ఒకే దేవాలయమందు త్రిమూర్తులను ఆరాదించుటకు వీలు కలిగించుట ఇచట గుర్తింపతగినది.

శిల్పాలు:

నాలుగవ గుహకెదురుగాకూడా కొంతదూరములో సెలయేటి తూర్పు ఒడ్డున పశ్చిమ ముఖముగా ఒక చిన్న దేవగృహము కలదు. ఇందు శివలింగము ప్రతిష్ఠింపబడియున్నది. గృహమున కిరువైపులా బ్రహ్మ,విష్ణువుల అర్ధశిల్పములు కోష్ఠములందు గలవు. మూడవ గుహకు ఎదురుగా సెలయేటికి అవతలి ఒడ్డున గల శిలాఖండముపై హరిహర, పటరాజ శిల్పములు గలవు.

ఉపసంహారము:

భైరవకోన గుహాలయాలు పల్లవ,పశ్చిమ చాళుక్య. రేనాటి చోడుల వాస్తు, శిల్పరీతుల సమ్మిళితమును కలిగియున్నవని చెప్పవచ్చును. ఈ గుహలలోని heavy figures, flat modelling, revealing linearism, high curved ends of the shoulders, rigid frentality ప్రాంతీయ కళాప్రభావాన్ని తెలుపుచున్నవి. కడప