Jump to content

పుట:AndhraGuhalayalu.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిల్పశైలితో ఇవి పోలిక కలిగియున్నవి. కాని గుహలు చాలా చిన్నవి. చెక్కిన సంప్రదాయమా, పైనించి క్రిందకు సాగినందులనూ, గర్భాలయాల ముందు ప్రాంగణములను నిర్మించినట్లు కానవస్తున్నది. కాని మహాబలి పురములో వలె గళ్ళు కొట్టి నడిమి ముక్కలను చెక్కుతూ సాగినట్లు కానరాదు. ఆ రీతినే అవలంబించియుంటే ఈ గుహలు బాగా లోతుగా ఉండియుండును. ఇవన్నీ ఒకే కాలానివిగా ఆగుపడవు. ఇచటి శిల్పనిర్మాణశైలి క్రీ.శ. 7వ శతాబ్దము మొదలు క్రీ.శ. 8 వ శతాబ్దము ఉత్తరార్ధమువరకు చెందినవై యుండునవి. దక్షిణ భారతదేశ గుహాలయాలలో ప్రాచీనమైనవని లాంగ్ హర్ట్స్ అభిప్రాయపడిరి కాని నూతన పరిశోధనలనుబట్టి ఈ గుహాలయాలు 8వ శతాబ్దమునకు చెందినవని చెప్పవచ్చునని డా॥బి. రాజేంద్రప్రసాద్ గారు ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇవి రెండు దశలలో నిర్మింపబడినవిగా అగుపడును. మొదటి నాలుగు గుహాలయాలు మొదటి దశకు. మిగిలిన నాలుగు మలిదశకు చెందినవని నిర్మాణరీతినిబట్టి చెప్పవచ్చును. ఒక పెద్ద గుఱ్ఱపునాడా ఆకారంలో గల ఏకశిలా గుట్టమొక్క ఏటవాలు ముఖభాగాన ఇవి వరుసగా నిర్మింపబడియున్నవి (చిత్రపటాలు11 నుండి 22 వరకు చూడుము) మొదటి గుహమాత్రము ఉత్తర ముఖమును, మిగిలినవన్నియు తూర్పు ముఖమును కలిగియున్నవి. ఇది పల్లవ సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది. మొదటి నాలుగు చతురస్రాకార గర్భగృహను మాత్రము కలిగి దానిమధ్య శివలింగము, పానవట్టమును కలిగియున్నది. ఈ గుహల ముందుభాగాన మండపములు లేవు (33 . 35 వ చిత్రపటములు చూడుము). వీటి కపోత సరిగా రూపొందింపబడలేదు మిగిలిన నాలుగు గుహలు చతురస్రాకార మాత్రము గర్భగృహ, మండవ, మండపమందు రెండు కుఢ్యస్తంభాలను రెండు స్తంభాలను కలిగియున్నవి ( 34, 35, 22వ చిత్రపటములు చూడుము). ఇవి 'కపోత'ను కలిగియున్నవి. ఈ గుహలన్నింటికి విడివిడిగా గల చిన్న ప్రాంగణములందు ఇరువైపుల గణేశ, చండేశుల అర్ధ శిల్పములున్నవి. స్తంభాలు కొన్ని మూలములందు (base) ఆసీన సింహాలను కలిగియున్నవి. ప్రతి మండపమందు ద్వారపాలకులు, బ్రహ్మ, విష్ణువులు గలరు. ప్రతి గుహాలయము ముందు గల ప్రాంగణము మధ్య నంది ప్రతిమ గలదు. ఇచట చండేశ. గణేశ అర్ధశిల్పాలు పల్లవేతర శిల్పప్రభావాన్ని తెలుపుచున్నవి. ఇచట గుహాలయము లన్నిటియందు శివలింగము గలదు. ఇవన్నియు చాలవరకు ప్రాజ్ముఖములుగా యున్నవి. ఇందలి శివలింగములు మధ్యను పరిమాణములై గుండ్రముగా, నున్నగా యున్నవి. ఇవి నల్లరాతితో చేయబడియున్నవి. ఎచటనుండో తెప్పించి ప్రతిష్ఠింపబడినవి. పానవట్టములు ఇచటి ప్రాంతీయ కొండరాతితోనే మలచబడినవి. చచ్చౌకముగ యుండి 18 అం॥ ఎత్తు గలవు. గుహాలయాలు 6½ అ॥పొడవు. 6 అ॥ ఎత్తు కలిగి యున్నవి. ముఖ్య దేవగృహ ప్రవేశమార్గమునకు ఇరువైపులా గల వెలుపలి కుఢ్యముపై రెండు చేతులు గల ద్వారపాలక ప్రతిమలు అర్ధశిల్పమున గుహాలయ ఏకశిలయందే మలచబడియున్నవి (చిత్రపటములు 13నుండి 22 వరకు మరియు 26నుండి 28 వరకు చూడుము). తాము ధరించిన పెద్ద 'గదల'పై వారు వాలినట్లు అగపడుచున్నారు ఇది పల్లవ సాంప్రదాయము. "వీరి శృంగ యుతోష్ణీషములు. జటాజూట శిలారచన పరిశీలించినచో మహాబలిపురము, తిరుచిరాపల్లి, దలవనూరు, మందగప్పట్టు మొదలైన ప్రాంతములందలి శిల్పనై పుణ్యమున ప్రదర్శించునవిగయున్నవి" అని ప్రొ॥ఆర్.సుబ్రమణ్యంగారు అభిప్రాయపడిరి.

ద్వారపాలకులకు ప్రక్కన బ్రహ్మ, విష్ణువుల ప్రతిమలు అర్ధశిల్పమునందు రూపొందింపబడియుండుట కూడ పల్లవ శిల్పరచనాశైలియే. గుహకు కుడివైపు బ్రహ్మ, ఎడమవైపు విష్ణువుండుటచే ఇవి కొంతవరకు త్రిమూర్తుల దేవాలయములని చెప్పవచ్చును. కాని ఇచట శివునికే ప్రాధాన్య మివ్వబడియున్నది. ఇచటి కుఢ్యమందలి మరుగుజ్జులు. ఆసీన సింహముపై పొడిగింపబడియున్న స్తంభములు. వాటిపై అడ్డముగా యుండు శిల్పములును పల్లవశైలికి చెందినవి. ఇచ్చట ప్రాచీన లిపితో వ్రాయబడిన కొన్ని శాసనములు గలవు. లిపి చదువరులు తెలుసు.