Jump to content

పుట:AndhraGuhalayalu.djvu/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యమైనవి. క్రీ.పూ. 200 ___ క్రీ.శ. 200 మధ్య కాలమందు దక్కన్ యందు పూనా, నాసిక్, ఆజంతా, ఔలింగాబాద్, ఎల్లోరా లందు మెతువుశిల (softer trap rock) యందు చైత్య గృహాలు, విహారాలు ఏర్పరచ బడినవి. ఉత్తర కోస్తా ఆంధ్ర యందు, దక్షిణ ఒరిస్సా యందు ఖందగిరి, ఉదయగిరి, గుంటుపల్లి, శంకరం వంటి ప్రాందాలలో మెతువు శిల యందు ఇవి నిర్మించ బడినవి. గుంటు పల్లి గుహాలయాలు సుదామ, లోమస్ రిషి గుహాలయలను పోలి యున్నవి. అజంతా యందలి గుహాలయాలలో ఎనిమిది క్రీ.ఫూ. 2 వ శతాబ్దము మధ్య భాగాన నిర్మించ బడినవి. మిగిలినవి 4 వ శతాబ్దము తరువాత నిర్మించ బడినవి. ఇది వాకాటక రాజుల కాలమందు క్రీ.శ. 450-650 మధ్య కాలమున నిర్మింప బడినవి. ఈ నిర్మాణాలు రాష్ట్ర కూటుల కాలమందు ఎనిమిది, తొమ్మిది శతాబ్దముల వరకు కొన సాగినవి. ఎల్లోరా గుహాలయాలు క్రీ.శ. 4 శతాబ్దము నుండి క్రీ.శ. 7 శతాబ్దము మధ్య కాలమున నిర్మింప బడినవి.

క్రీ.శ. మొదటి మిలినీయం యెక్క రెండవ అర్థ భాగమున హిందు, జైన, బౌద్ధ శిలా గుహాలయాల నిర్మాణము వాతాపి (బాదామి) చాళుక్యులు, వేంగీ చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు దక్షిణ భారత దేశమందు రాజ్యాలను స్థాపించుటతో ప్రారంభమైనది. క్రీ.శ. 6 వ శతాబ్దము మొదలు 9 వ శతాబ్దము వరకు వీరి కాలము లందు జరిగిన నిర్మాణాలు ముఖ్యమైనవి. ఈ విధానము 10 వ శతాబ్దము కొనసాదినది. రాజకీయాలందే గాక వాస్తు, శిల్ప,సాహిత్య పోషణ లందు కూడ వీరు, ఇతర చిన్న రాజ వంశాల వారు పోటీ పడుచుండిరి. చాళుక్య రాజైన మంగకేస, ఇతని సమ కాలికుడు పల్లవ రాజైన ఒకటవ మహేంద్ర వర్మ లతో గుహాలయాల నిర్మాణము దక్షిణ దేశంలో ప్రారంభమైనది. క్రీ.శ. 578 లో బాదామి యందు మొదట విష్ణు గుహాలయమును మంగళేశ నిర్మించాడు. ఒకటవ మహేంద్ర వర్మ మందగ పట్టు యందు త్రిమూర్తుల కొరకు తనమొదటి గుహాలయము నిర్మించాడు. మంగళేశ మౌర్యుల కాలమునుండి వాడుకలో నున్న మెతువు రాళ్ళయిన sand stone, trop or lime stone లందు గుహాలయ నిర్మాణములు చేయగా మహేంద్ర వర్మ( క్రీ.శ. 530- 630) కఠిన శిల (hard granite rock) లందు నిర్మించినాడు. మహేంద్ర వర్మ అశోకుని తరువాత మొదట తన కాలమందు ఇటుక,కలప, లోహములు లేని "లక్షితము" లేక దేవ గృహము త్రిమూర్తులకు నిర్మించినట్లు చెప్పుకొని యున్నాడు. కావున పల్లవులు కఠిన శిలలందు, చాళుక్యులు మెతువు శిలలందు గుహాలయములు రూపొందించెడు రెండు విధానాలను దక్షిణ దేశమందు ప్రారంభించిరని చెప్పవచ్చును. ఇట్టి శిలా సాంప్రదాయాలు విజయనగర కాలమువరకు కొనసాగినవి.

పల్లవ రాజైన మొదటి మహేంద్ర వర్మ (క్రీ.శ. 580-630) కాలానికి చెందిన గుహాలయాలు ముఖ్యముగా 10 కలవు. వానిలో లక్షిత యాతన (మందగప్పట్టు) పంచ పాండవ గుహాలయం (పల్లవరం) మొదలగునవి కలవు.

ఇతని కుమారుడు మొదటి నరసింహ వర్మ మామల్ల (క్రీ.శ. 630- 72) ఒకటవ పరమేశ్వర వర్మ (672- 700,రాజ సింహ లేక రెండవ నరసింహ వర్మ (700-723) ఇతని నిర్మాణ రీతిన కొనసాగించి ఓరగడం, మందవ (తిరుక్కల్ కున్రం) కోటికల్ మండప (మహాబలిపురం ) మొదలగు వాటిని వీరు నిర్మించిరి.

మహేంద్ర వర్మ కుమారుడైన మొదటి నరసింహవర్మ మామల్ల (630- 688) మహేంద్ర రీతిలోని గుహాలయాలను, ఏక శిలా రథములను రూపొండిచినాడు. ఇవి చాల వరకు మహాబలిపురమందు గలవు.

తూర్పు చాళుక్యులు కూడా మెతువు శిలయందు కృష్ణకు ఇరువైపులా సుమారు 12 గుహాలయాలను నిర్మించిరి. ఇవి ఉండవల్లి, మొగల్ రాజపురము, విజయవాడ, పెనమాగ, సీతారామపురములందు గలవు. ఇవి క్రీ.శ. 7 - 8 శతాబ్దములకు చెందినవి.