Jump to content

పుట:AndhraGuhalayalu.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగ స్తంభముల వరుసలోనే కుడి ఎడమ కొసలలో ముందుకు చొచ్చుకొనియున్న స్తంభాలు గలవు. ఈ కొసలలోనే రెండువైపులా దిక్పాలురు గలరు. వీరు చెరొకరు ఎడమ, కుడి చేతులను బరువైన గదపై కలిగి మరొక చేతిని(తూర్పువైపు ద్వారపాలుడు) కటి హస్తరీతిలోను,(మరొకరు) విస్మయ హస్తరీతిలోను కలిగియున్నారు. వీరి ఉత్తరీయము యజ్ఞోపవీత వైపుగా దేహముపై కలిగి పల్లవరీతిలో వలె కుడిచేతిపై ఆనియున్నది. ద్వారపాలురు తలలపై కొమ్ములు గలిగి, వాటి మధ్య శిరోవస్త్రము కలిగియున్నారు.

దీని వరండాయందు స్వేచ్ఛగా నిలబడియున్న నాలుగు స్తంభములు, రెండు స్తంభములు ఏర్పరిచి యున్నందున వరండా రెండు విభాగాలుగా విభజింపబడి యున్నది. వీటి వెనుక ఒక అధిష్టానముపై మూడు గుహాలయాలు గలవు. మధ్యది ఆఖరు దాని కన్నను కొంత పెద్దదిగా యున్నది, ఈ గుహాలయము శివునికి అంకితమైనది. కానీ ఇరువైపుల విష్ణు, బ్రహ్మలు గలరు. ఈ గుహాలయము ముందు గల 'ముఖమండప' ప్రక్క భాగాలలో స్తంభమండపములు గలవు. తూర్పుది స్పష్టముగా రూపొందించబడినప్పటికి. పశ్చిమ భాగముది అసంపూర్తిగా వదిలివేయ బడియున్నది. ఇట్టి విధానము ఎల్లోరా, ఐహోలె మొదలగు ప్రాంతాలలో గల తూర్పు చాళుక్య సాంప్రదాయమును తెలుపుచున్నవి. ఇదియే త్రికూట ఆలయ నిర్మాణాలకు మార్గదర్శకమని భావించవచ్చును.

ఐదవ గుహాలయము తూర్పుముఖముగా వున్నది. దీని ముఖమండపము వెనుక ఒకే దేవగృహము గలదు దీనికి సిలాప్టర్ ద్వార విభాగము గలదు. దేవ గృహమునకు ఇరుపైవులా ఇద్దరు ద్వార పాలురు గలరు. వీరు ఖడ్గము, డాలు గలిగి తమిళ ప్రాంతమందలి శియమంగళ గుహాలయములోని ద్వార పాలురవలె వున్నారు. మండప మందు అనేక స్తంభములు గలవు. గుహ ముఖ భాగపు (facade) దక్షిణ కొస భాగాన చొచ్చుకొని యున్న కుడ్య స్థంభము పూర్ణఘటను గలిగి యున్నది. ఈ పూర్ణ ఘట రూపము ఔరంగాబాదు, ఎల్లోరా మొదలగు ప్రాంతాల బౌద్ధ నిర్మాణాలలోను, ఐహోలె వంటి ప్రాంతాలలోను కల తొలి హైందవ దేవాలయములలో అగుపడును.

ఉండవల్లి గుహాలయము:

ఉండవల్లి గుహాలయాన్ని ప్రాంతీయముగా అనంతశయన గుడి (గృహ) యందురు. రెండవ అంతస్తు లోని అనంత శయన విష్ణు ప్రతిమ వలన దీనికీ పేరొచ్చినది. ఇది కృష్ణ ఉత్తర ఒడ్డున వున్నవిజయవాడకు ఎదురుగా కృష్ణ దక్షిణ ఒడ్డున (గుంటూరు జిల్లాలో) గుంటూరు విజయవాడ మధ్య (విజయవాడ తరువాత రెండు మైళ్ళ దూరంలో) గల తాడేపల్లి రైల్వేస్టేషన్ కు వాయవ్యమున ఉన్నది. ఇచటి గుహాలయము ఈశాన్య ముఖముగా వున్నది.

గ్రౌండ్ ప్లోర్ భాగము తప్ప మిగిలిన ఈ గుహాలయపు మూడు అంతస్తులు సుమారు 50 అడుగుల ఎత్తు గలిగి, వీటి ముందు భాగము 90 అడుగుల పొడవు యున్నది. గ్రౌండ్ ప్లోర్ అసంపూర్తిగా వున్నది. సాదా హాలు కలిగి లావైన ఘన చతురస్రాకార స్థంభములు గలిగి వున్నది. కాని ఒకటవ ప్లోర్ భాగము, విశాలముగా వున్నది. ఇందలి స్తంభాలు మొరటుగా, ఘన చతురస్ర, అక్టాగనల్ విభాగాలను గలిగి, పైభాగాన బరువైన తరంగ కార్బెల్, దాని పైన ఒక frieze of geas అటుపై బరువైన 'కపోత ' (roll cornice) (దానికి చైత్య "కూడు " విభాగాలు) గలవు. గుహ లోపలి విభాగము స్తంభ మండపాన్ని గలిగి దాని వెనుక గోడ భాగమున దేవ గృహమున దేవ గృహము ఏర్పరచబడి దేవత ప్రతిమ లేక శివలింగ స్థాపనకు 'పీఠము' ఏర్పరచబడి యున్నది. ఈ మధ్య (కేంద్ర) దేవ గృహమే గాక దీనికి ఎడమ రెండు, కుడివైపున మరొక దేవ గృహములు కలవు. ఎడమ వైపు కొసనున్నది చిన్నది. ఈ దేవ గృహలన్నిటికి