పుట:AndhraGuhalayalu.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పర్వత దక్షిణ భాగాన రెండవ, మూడవ గుహాలయాలు, అచటనే (దుర్గ దేవాలయమునకు పశ్చిమాన) రెండు ఫర్లాంగులలో గల మరొక పర్వత ఉత్తర భాగాన నాల్గవ గుహాలయము, దీనికి వాయువ్యాన గల మరొక కొండపై ఐదవ గుహాలయము గలవు.

ఒకటవ గుహాలయము మూడు దేవ గృహములను కలిగి యున్నది. వీటి ముందు అన్నింటికి కలిసి ఒక వరండా కలదు. ఇది ముఖ భాగమున రెండు స్తంభాలను కలిగి మండప ఎడమ కుడి కొనలలో రెండు అర్థ స్తంభాలను కలిగియున్నది.

రెండవ గుహాలయము సుమారు 7 అ॥ 6॥ చతురస్రము గల ఒకే దేవ గృహమును కలిగి దాని ముందు దేవ గృహమునకన్న రెండింతలు గల దీర్ఘ చతురస్రాకార వరండా కలిగి యున్నది. దీని ముఖ భాగమునకు సపోర్టుగా రెండు సాధారణ స్తంభాలు, వరండాకు ఎడమ కొసలలో రెండు స్తంభాలు కలవు.

మూడవ గుహాలయము చాల వరకు రెండవ గుహాలయమువలె యున్నది. కాని దీని దేవ గృహము చిన్నదిగా యున్నది. సుమారు 6 చ॥ అ॥ యున్నది. దీని ముందు గల మండపము సుమారు 12 అ. 9 అం. చతురస్రాకారముగ యున్నది. కానీ దీని ముఖ భాగము కపోత(కార్నిస్)ను, అందు చైత్య కూడులను మూడింటిని కలిగి యుండుటే గాక దీని వెనుకగా పై అంతస్తు గుహాలయ అంతర పట్టికలను, సాదా లూపములను కలిగి యున్నది. ఈ గుహా స్తంభాలు ఘన చతురుస్రాకార, అక్టాగనల్ సెక్షన్ విభాగాలను కలిగి యున్నవి. ఇచటి దేవ గృహములో వెనుక కుడ్య ముఖ భాగాన మొరటుగా రూపొందింప బడిన దుర్గ ప్రతిమ గలదు.

ఈ గుహాలయ ముఖభాగపు తూర్పు విభాగాన శిథిల దశలోని త్రిమూర్తులు గల కూడు యుండగా, పశ్చిమ విభాగాన అసంపూర్తిగా వున్న త్రిమూర్తుల చిత్రము గలదు. ఈ శిల్పమునకు పశ్చిమాన ఎవరినో వధించుచున్న యుద్దవీరుని అర్థ శిల్పము, క్రీ శ. 8 లేక 9 వ శతాబ్దమునకు చెందిన శిథిలమైన (తొలి) తెలుగు శానము గలవు. ఒకటవ గుహాలయము తొలి దశకు చెందినదిగను: రెండవ మూడవ గుహలు తరువాతి దశకు చెందినవిగను చెప్పవచ్చును. మూడవ, నాల్గవ గుహలు చాల వరకు తమిళ ప్రాంత మందలి పల్లవ మహేంద్ర వర్మ గుహలను పోలి యున్నవి.

నాల్గవ గుహాలయము మొగల్ రాజ పురం గుహాలయలన్నింటి లోకి పెద్దదేగాక శిథిలము కాకుండా యున్న పరిణతి చెందిన దశకు చెందినదిగా చెప్పవచ్చును. (5 , 6 చిత్ర పటములుచూడుము)

ఇది ఓపన్ ముఖ మండపమును కలిగి యున్నది. గుహాలయ ముఖ భాగమున entablature నందు గల కాపిటల్ భాగమున తరంగ కార్బెల్ కలదు. అంతే కాక సాదాగా అడ్డానికి రూపొందించ బడి యున్న చూరు అత్తడ (eavesboard) కపోత (roll-cornice) క్రింధి భాగమున గలవు. కపోత. పై విభాగాలలో 'చైత్య' (కూడు) లేక నాసిక విభాగాలు గలవు. వీటి మద్య భాగాన దేవీ సమేతుడైన విష్ణు, దేవీ సమేతుడైన శివుడు, మూడు శిరస్సుల బ్రహ్మ వరుసగా కుడి నుండి ఎడమవైపుగా రూపొందింప బడి యున్నారు. ఈ "కూడు ' లేక నాసిక ల crest భాగమున ' సింహాలలాట' విభాగము గలదు. కార్నిస్ పై విభాగమున వెనుకగా ఏనుగులు, సింహముల అర్థ శిల్పముల వరుస కలదు. వీటి పై భాగాన మధ్యగా శిథిల దశలో గల అర్థ శిల్ప రూప తాండవ శివుడు గలదు. మండప ముఖ భాగమున గల పల్లవ మహేంద్ర వర్మ రీతిలో గల లావు పాటి సదురం....కట్టు....సదురం. రకమునకు చెందిన స్తంభములు గలవు. వీటి లోపలి ముఖ భాగపు పై సదుర ముఖ భాగాన గల 'పధకము' లు (medallions) విష్ణు, కృష్ణుల గజేంద్ర మోక్ష, పూతన సంహార ఘట్టములు, గందర్వలను గలిగియున్నవి. గుహ యొక్క ముఖ