కు పూర్వబుక్కును విడచి ఉత్తరార్చికమం దితర ఋక్కు గానము చేసి తే వికృతి ధానమందురు.
వేదము లన్నియు అపౌరుషేయములు. బ్రహ్మవల్ల ఋషులకు గోచరించినవి. పురుషులు నిర్మించినవికాపని సిద్ధాంతము. వ్యాసాది రచితములైన పురాణాదులును. కాళిదాసాదులు రమించిర కావ్య నాటకాదులును పౌరుషేయములనంబడును, కావున ఉత్తరార్చికమంతయు పౌరుషేయమందురు. !
వేదముల కధకామును దెనుఁగున వ్రాయుటే మా యుద్యమ మయ్యును సాము కోట. ప్రత్యేకత్వమును దెల్పుటకు వేదాంగములలో నొక్కటైన నారద శిక్ష ననుకరించి కొంత గాన స్వరూపమును వ్రాసితిని. ఇట్లే అర్ధ మాత్రమునకు మా యుద్యమమయ్యును • అధర్వవేద సూ కములకు వినియోగములం గూడ వ్రాయు చున్నాము. మానవులకుఁ గావలసిన సమస్తాళలును అధర్వవేద వినియోగములు తెలిసినచో బూణ- ములగునని అది చదువగానే బోధపడఁగలడు. ఇంతవఱకును నా అనుభవము చేత నాంధ్ర శోకము మా ఉద్యమమునకుఁ దోడు చూపలేదు. అచ్చయిన గ్రంధములు చెల్లినంగాని ముందు ముందు అచ్చగువానికి మదుపు లేకుండును
వినయాశ్రమము. బంకుపల్లె మల్లయ్య శాస్త్రి.