ఉపోద్ఘాతము.
--(0)--
ఋగ్యజుస్సామాధర్వములను నాలుగు వేదములలో ఋగ్వేదమే అన్నిట నాక్రమించి యున్నదన వచ్చును. అనగా ఋగ్వేదము లోని మంత్రములే యితర వేదంబులలో జాలవఱకును గలవని తాత్పర్యము. ఋగ్వేదమంత్రములే చిన్న పాఠ భేదముతోను, పాఠభేదము లేకను ఇతర వేదములలో గలవు
సామవేదమంతయు ఋగ్వేదమంత్రములకే గానము. అయితే సామవేదమునకు ప్రత్యేకత యెటులంటే ఏ కొద్ది మంత్రములు మాత్రము కలవు. దాని చేతనేగాక గానవిశేషము చేత గూడ సామమునకు ప్రత్యేకత గలదు. శ్రీవిద్యారణ్యుల వారుకూడ ప్రత్యేకముగా సామవేదమునకు భాష్యము వ్రాసి యున్నారు. దానిం బట్టియే నేననువదించితిని. పాదబద్ధములై నియతాక్షరములు కల మంత్రములకు ఋక్కులని పేరు. ఆథర్వమందలి మంత్రములకు కూడ ఋక్కులన్న పేరు కలదు. గానమున కింత ప్రాధాన్యమివ్వ వలెనా యంటే – ఇవ్వ వలెను. తపస్సుల వలన గాని సమాధి వలన గాని గానము చేత కలిగిన భావోద్రేకము కలుగదు. భావో దేశమే భగవంతుని గనుంగొనుటకు సాధనము. అందుకనియే యాగములలో సామవేదగానముతో మన పూర్వులు స్తుతులు చేసి దేవతల నారాధించి సిద్ధిని బొందిరి. "సామగానలోల” అని భగవంతునకు సంబోధనము కలదు.
నారదశిక్షలో సామగానమును గూర్చి యిట్లు చెప్పంబడెను. -సాను వేదే తు వక్ష్యామి — స్వరాణాం చరితం యధా — తానరాగ స్వర గ్రామ మూర్ఛనానాం తు లక్షణం = సామవేద స్వరములను వాటి నడకలను చెప్పుచున్నాను. ఎట్లంటే-తానము-రాగము-స్వరము-గ్రామము-మూర్ఛన అనువాని లక్షణములను జెప్పుచున్నాను. శ్లో ॥ సప్త స్వరాస్త్రయో గ్రామా॥ మూర్ఛనాస్వేక వింశతిః। తానా ఏరో నపంచాశ ది హ్యేతత్స్వర మండలం! షడ్జశ్చ ఋషభశ్భైవః గాంధారో మధ్యమ స్త ధా పంచమోధైవత శ్చైవ। నిషాదస్సప్తమస్స్వరః॥
ఏడు స్వరములు, మూడు గ్రామములు, ఇరువై యొక్క మూర్ఛనలు, నలభై తొమ్మిదితానములు, అందు షడ్డ, ఋషభ, గాంధార, మధ్యమ, పంచము, దైవత, నిషాదములని యేడు స్వరములు. ఇత్యాదిగా నన్నిటి లక్షణములును జెప్పంబడి నారదాది శిక్షలు వేదాంగములలోనివి. వీనిలో సంగీతశాస్త్రములైన