పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మాత్యకవిత్వవైభవరమాపరిశోభితహృత్పయోరుహా.[1]

480


క.

తిరుమలతాతయవంశా, భరణశ్రీసింగరార్యపరమగురుకృపా
పరిపూర్ణహృదయయాచక, వరచేతఃకమలినీదివాకరమూర్తీ.[2]

481


శ్రీరమణవృత్తము.

 సంగరధనంజయ విశాలమహిమాస్పద ప్రశస్తగుణశోభిత మహీభృ
త్పుంగవసభాభినయభూరిగుణమండిత నభోమణినిభప్రకటతేజ
స్సంగత మహాసుకవిసన్నుతచరిత్ర రిపుశాసనపరాక్రమకసద్ది
వ్యాంగదసముజ్జ్వలమహామణివిభాంచితపదాంబురుహ భావభవరూపా.[3]

482


గద్యము.

ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితగోత్రపవిత్ర సుకవిజనవిధేయ
వెన్నెలకంటిసూరయనామధేయప్రణీతంబైన యాదిమహాపురాణంబగు బ్రహ్మం
డంబునందలి పరాశరసంహితయైన శ్రీవిష్ణుపురాణంబునందు బలదామోదరులు
సాందీపునివలన విద్యాభ్యాసంబు సేయుటయు కాలయవనువధయును బల
భద్రుండు వరుణదేవుచేత వరంబులు గొనుటయు రుక్మిణీకల్యాణంబును నరకా
సురవధయును పారిజాతాపహరణంబును బాణాసురయుద్ధంబును పౌండ్ర
వాసుదేవునిమరణంబును దూర్వాసుశాపంబున యాదవులు పరలోకగతులగు
టయు రామకృష్ణులపరోక్షంబును అష్టావక్రుచరిత్రంబును కలియుగధర్మం
బును నైమిత్తికప్రాకృతాత్యంతికప్రళయంబులును కేశిధ్వజఖాండిక్యజనకసం
వాదంబును యోగవిద్యాప్రశంసయు నన్నది సర్వంబును అష్టమాశ్వాసము.[4]


శ్రీవిష్ణుపురాణము - సంపూర్ణము

————

  1. సత్యవచోవిలాస = సత్యవాక్యమే లీలాప్రవర్తనముగాఁ గలవాఁడా, రిపుశాసన = పగవారిని శిక్షించువాఁడా, సంగరపార్థ = యుద్ధమునందు అర్జునుఁడా, పల్లవాదిత్య = పల్లవాదిత్యుఁడు అనుబిరుదు పేరుగలవాఁడా, వనీపకపారిజాత = యాచకులకు కల్పవృక్షమైనవాఁడా, సాహిత్యకళాభివర్ధన = సాహిత్యవిద్యను అభివృద్ధి పొందించువాఁడా, మహీనుత = లోకులచేత కొనియాడఁబడువాఁడా, వెన్నెల...పయోరుహా = వెన్నెలకంటి సూరయమంత్రియొక్క కవిత్వవైభవ మనెడులక్ష్మిచేత మిక్కిలి వికసించిన హృదయకమలముగలవాఁడా.
  2. యాచకవరచేతఃకమలినీదివాకరమూర్తీ = యాచకులయొక్క మంచిమనస్సు లనెడుతామరఱేఁకులకు సూర్యస్వరూపుఁడా.
  3. సంగరధనంజయ = యుద్ధమునందు ఆర్జునుఁడా, విశాలమహిమాస్పద = మిక్కుటమైనమహిమకు ఉనికిపట్టయినవాఁడా, ప్రశస్తగుణశోభిత = మేలైనగుణములచేత ప్రకాశించువాఁడా, మహీభృత్పుంగవసభాభినయభూరిగుణమండిత = రాజశ్రేష్ఠులగోష్ఠికిఁ దగినఅభిప్రాయమును సూచించెడి గొప్పగుణములచే అలంకరింపఁబడినవాఁడా, నభోమణినిభప్రకటతేజస్సంగత = సూర్యునితేజస్సువంటి తేజస్సును బయలుపఱచునట్టి తేజస్సుతో కూడినవాఁడా, మహాసుకవిసన్నుతచరిత్ర = గొప్పవారైన మంచికవులచే స్తోత్రము చేయఁబడినచరిత్రము గలవాఁడా, రిపు...పచాంబురుహ = శత్రువులను శిక్షించునట్టి పరాక్రమముచేత ప్రకాశమానమై అప్రాకృతమైన భుజకీర్తులయందు వెలుఁగునట్టి గొప్పమణులయొక్క కాంతులచేత ఒప్పునట్టి పాదపద్మములు గలవాఁడా - పాదాక్రాంతులైన శత్రువులు గలవాఁడా యనుట. భావభవరూపా = మన్మథునిసౌందర్యమువంటి సౌందర్యము గలవాఁడా.
  4. ఇది శ్రీమత్కౌళికకులతిలకానంతార్యవిరచితంబైన శ్రీవిష్ణుపురాణటీకాసంగ్రహము.