పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సభాజిత్తుండును వానికి మహిష్మంతుండునుం బుట్టిరి. వానిపేర మాహిష్మతీ
పురం బయ్యె నట్టిమహిష్మంతునికి భద్రశ్రేణియు వానికి దుర్దముండును వానికి
ధనకుండును వానికిఁ గృతవీర్యుఁడును కృతాగ్నియు కృతధరుండును గృతౌ
జుండు నన నలువురు పుట్టిరి. వారిలోనఁ గృతవీర్యునకు నర్జునుండన సహస్ర
బాహుండు పుట్టి.

188


క.

అత్రికి ననసూయకు స, త్పుత్రకుఁడై విష్ణునంశమునఁ బుట్టిన ద
త్తాత్రేయమౌనికృపకుం, బాత్రుండై యతనిఁ గొలిచి పరమప్రీతిన్.

189


ఉ.

ఆహవభూమియందు నభియాతులచే నపరాజితత్వమున్
బాహుసహస్రకంబు నిరపాయపరాక్రమము ధరిత్రి ను
త్సాహ మెలర్ప నేలుటయు సర్వజనప్రియవర్తనంబు నా
శ్రీహరిచేతఁ జావు దనుఁ జెందఁగ గోరె వరంబు లర్థితోన్.[1]

190


క.

సప్తాశ్వసదృశతేజో, దీప్తుండై రిపుల గెలిచి దీనావనుఁడై
ప్రాప్తశ్రీనిధి యేలెను, సప్తద్వీపములతోడి జగతీతలమున్.[2]

191


క.

భవ్యగతి కార్తవీర్యుం, డవ్యాహతవిభవయుక్తుఁ డగుచు ననష్ట
ద్రవ్యులఁగా జనులను లో, కవ్యవహారంబు నడపఁ గౌతుక మమరన్.[3]

192


ఉ.

ఊర్జితధర్మవృత్తి గ్రతువుల్ పదివే లొనరించి మించి యా
నిర్జరకోటిఁ దన్పి కమనీయగతిన్ నిజబాహువిక్రమో
పార్జిత మైనయర్థము వ్యయం బొనరించి యెలర్చెఁ గార్తవీ
ర్యార్జునచక్రవర్తి సముదంచితనిర్మలపుణ్యమూర్తియై.[4]

193


ఆ.

అట్టికార్తవీర్యుఁ డంగనాజనసహ, స్రముతోడఁ గూడి నెమ్మి నేగు
దెంచి నర్మదానదీజలంబులలోన, నొనరఁ గేళి సలుపుచున్న యంత.[5]

194


క.

ఆవేళ యక్షకిన్నర, దేవాసురులను జయించి దిగ్విజయముతో
రావణుఁ డఖలామరవి, ద్రావణుఁ డరుదెంచి విడిసెఁ దనసైన్యముతోన్.[6]

195


వ.

ఇట్లు విడిసి.

196


క.

రేవానదిలోపల సం, ధ్యావిధు లొనరించుచున్న నది యెఱిఁగి ధరి

  1. అభియాతులచేన్ = శత్రువులచేత, అపరాజితత్వమున్ = ఓటమిలేని తనమును, ఎలర్పన్ = చిగుర్ప - పెరుగ.
  2. సప్తాశ్వసదృశతేజోదీప్తుండు = సూర్యునితేజస్సును బోలిన తేజస్సుచేత ప్రకాశించువాఁడు, దీనావనుఁడు = దరిద్రులను రక్షించువాఁడు, జగతీతలమున్ = భూప్రదేశమును.
  3. భవ్యగతిన్ = (లోకమునకు) మేలు గలుగునట్టిరీతితో, అవ్యాహతవిభవయుక్తుఁడు = కొట్టుపడనియైశ్వర్యముతో కూడుకొన్నవాఁడు, అనష్టద్రవ్యులఁగాన్ = చెడనిధనము గలవారినిఁగా - ధనసమృద్ధి గలవారు అగునట్టుగా.
  4. ఊర్జిత = నానాట పెరిగి స్థిరపడిన, తన్పి = తృప్తి నొందించి, ఎలర్చెన్ = వికాసమును వహించెను.
  5. నెమ్మిన్ = నెమ్మదితో.
  6. అఖిలామరవిద్రావణుఁడు = ఎల్లదేవతలను తఱుముఁగొట్టినవాఁడు.