పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రంభుఁ డనురాజు దనకుఁ బుత్రకులులేక, తపము సేయుచునుండె నుదగ్రవృత్తి.

169

యయాతిచరిత్రము

వ.

మఱియు నహుషునకు యతియయాతిసంయాత్యాయాతినియతికృతు లను
కుమారు లార్వురు పుట్టి రందు యతి రాజ్యసుఖంబు లొల్లక యతీశ్వరుండై
పోయె యయాతి రాజ్యాభిషిక్తుండై భార్గవపుత్రి యైనదేవయానయు వృష
పర్వపుత్రియైన శర్మిష్ఠయును ధర్మపత్నులుగా నభిమతసుఖంబు లనుభవించు
చుండ.

170


క.

యదుదుర్వసు లనుపుత్రకు, లుదయించిరి దేవయాన కున్నతమతులై
ముద మొదవఁగ శర్మిష్ఠకు, నొదవిరి ద్రుహ్యానుపూరు లుత్తము లగుచున్.

171


క.

జననాథుఁడు శర్మిష్ఠకు, ననురాగము చేసి దేవయానకు నహితం
బొనరించుచుండ శుక్రుఁడు, జనవరునకు శాప మిచ్చె జరుఁడై యుండన్.[1]

172


వ.

ఇట్లు జరాభారపీడితుండై యయాతి శుక్రునియనుగ్రహంబుఁ బడసి తనకుమా
రులనందఱం బిలిచి యిట్లనియె.[2]

173


ఆ.

వినుఁడు తనయులార విషయోపభోగంబు, లందు నేను తనివిఁ బొందకున్న
వాఁడ నింక వేయివత్సరంబులకు నిం, ద్రియములెల్లఁ దృప్తి దేలు నాకు.

174


క.

కావున మీలో నొకరుఁడు, నావార్ధక మర్థిఁ బూని నవయౌవనమున్
నావలనం గొనుఁ డీపనిఁ, గావించినవాని రాజుఁగా నొనరింతున్.

175


తే.

అనినఁ బూరుఁడు దక్కఁ దక్కినతనూజు, లందఱును దండ్రిపలుకుల కపహసించి
జవ్వనం బిచ్చి ముదిమి గోఁజాల మనుచుఁ, దలఁగిపోయిన నహుషపుత్రకుఁడు గినిసి.[3]

176


వ.

భవదీయప్రసూతు లైనవారు రాజ్యార్హులు గారని శాపం బిచ్చి తనవచనంబు
లాదరించిన పూరునకు ముదిమి యిచ్చి యతని జవ్వనంబుఁ గైకొని యథాకా
లోపపన్నంబు లైనకొమోహభోగంబులు ధర్మమార్గంబు దప్పకుండ సమ్యక్ప్ర
కారంబున విశ్వాచి యనునప్సరతోడంగూడ ననుభవించి సహస్రవత్సరంబులు
పరిపూర్ణం బైననొక్కనాఁడు యయాతి దనమనంబున.[4]

177


తే.

అనుభవించితి నిన్నినా ళ్లఖిలవిషయ, భోగములు కోర్కు లేమియుఁ బొలిసిపోవు

  1. జరుఁడు = ముసలివాఁడు.
  2. జరాభార = ముదిమియొక్క యతిశయముచేత.
  3. కోఁజాలము = తీసికోలేము, కినిసి = కోపించి.
  4. యథాకాలోపన్నంబులు = తగినకాలములయందు పొందఁబడినవి, సమ్యుత్ప్రకారంబున = క్రమమైనరీతితో.