పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అనుకంపలు చిత్తములన్, బెనలు గొనన్ మౌనివరులు పృథివీతలనా
థునికడకు వచ్చి సంభా, వనలు వడసి యధికగౌరవము దీపింపన్.[1]

104


ఉ.

పార్థివచంద్ర యీగతిఁ దపం బొనరింపఁగనేల వేల్పులన్
బ్రార్ధన చేసి దుర్దశలు పాటిలనేల నికరంబు లీ
యర్థము లెల్ల వీనియెడ నాసలఁ జెందకు మేము నీకుఁ బు
త్రార్థము వైష్ణవం బగుమహాక్రతు విప్పు డొనర్తు మర్థితోన్.[2]

105


ఆ.

అందుఁ గులపవిత్రుఁ డగుపుత్రుఁ డుదయించు, లలిత మైనపుణ్యఫలము నీకుఁ
గలుగు ననుచుఁ బుత్రకామేష్టి వేల్చిరి, దివ్యమంత్రశక్తి తేజరిల్ల.[3]

106


సీ.

ఈరీతిఁ బుత్రకామేష్టి వేల్చి సమాప్త మగుదివసంబున నర్ధరాత్రి
వరమంత్రపూతాంబుపరిపూర్ణకాంచనకలశంబు వేదిపై నిలిపి జాగ
రము సేయ మఱచి సంయములు నిద్రాసక్తులైయున్న యాసమయంబునందు
యువనాశ్వుఁ డనవరతోపవాసపిపాస నొంది యచ్చోటికి నొయ్యవచ్చి


తే.

వేదిపై నున్న మంత్రపూతోదకములు, గ్రోలి తానును నిద్రించెఁ గొంతసేపు
నకు మునీంద్రులు మేల్కని యరసి రిత్త, యైనకలశంబు చూచి యిట్లనిరి కినిసి.[4]

107


క.

సంతానార్థం బీనృపు, కాంతకుఁ బానంబు సేయఁగా నునిచినకుం
భాంతరమంత్రోదకములు, చింతింపక గ్రోలినట్టి చెడు గెవ్వఁడొకో.

108


క.

చెప్పుఁడు చెప్పకయుండిన, నిప్పుడె శపియింతు మనిన నిలఱేఁడు భయం
బుప్పతిల లేచి వణఁకుచు, నప్పరమమునీశ్వరులకు నర్థిం బలికెన్.[5]

109


క.

ఉపవాసాయాసంబున, నపరిమితపిపాసనొంది యంగము లెల్లం
దపియింప నోర్వఁజాలక, యిపు డుదకము గ్రోలినాఁడ నే నని పలికెన్.

110


క.

తాపసవరులందఱు నా, భూపతి వీక్షించి యకట బుద్ధివిహీన
వ్యాపారదోషమున నీ, వేపుగ గర్భంబు దాల్తు వింతియుఁ బోలెన్.[6]

111


క.

జననాయక నీగర్భం, బునఁ గడుబలవంతుఁ డైనపుత్రుఁడు జన్మిం
చు ననుచుఁ బలికి రప్పుడు, మునివరులయనుగ్రహం బమోఘం బగుటన్.

112


వ.

ఇవ్విధంబున నతండు గర్భంబు దాల్చియున్నంతఁ గొంతకాలంబునకు నతని దక్షి
ణకుక్షి భేదించి మహాబలపరాక్రమసంపన్నుం డైనపుత్రుండు జన్మించిన.

113


తే.

విరులవాన గురిసె సురదుందుభులు మ్రోసె, దివ్యవాణి పొగడె దివిజఖచర

  1. అనుకంపలు = దయలు.
  2. ఈగతిన్ = ఈవిధమున, నిరర్థకంబులు = వ్యర్థములు, ఈయర్థములు = ఈ ప్రయోజనములు - ఈపను లనుట.
  3. లలితము = మనోజ్ఞము.
  4. పూతము = పరిశుద్ధము, కాంచనకలశము = బంగారుకుండ, వేదిపై = వేదికమీఁద - అరుఁగుమీఁద, పిపాసన్ = దప్పిని, ఒయ్యన్ = మెల్లగా, క్రోలి = త్రాగి, రిత్త = వట్టిది, కినిసి = కోపించి.
  5. ఇలఱేఁడు = భూపతి - రాజు, ఉప్పతిలన్ = పుట్టఁగా.
  6. బుద్ధివిహీనవ్యాపారదోషమునన్ = బుద్ధితక్కువపనివలని తప్పుచేత, ఏపుగన్ = అతిశయముగ - అపూర్వముగా.