పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీవును నతనియట్ల బంధురిపుతుల్యుండవై యాత్మ సర్వాంతర్యామి యని తెలిసి
సమచిత్తుండవై యుండుము.[1]

378


ఉ.

భూవరముఖ్య యీసకలభూతములు హరికంటె నవ్యముల్
గా నటుగాన లోకములఁ గల్లినయీసచరాచరంబులున్
నీవును నేను నాత్ముని వినిశ్చలశాశ్వతమూర్తిభేదముల్
కావున భేదమోహపరికల్పన లిన్నియు మాను జ్ఞానివై.

379


క.

అని నిర్దేశించిన న, మ్మనుజేంద్రుఁడు బ్రహ్మయోగమహితాత్ముండై
తనరుచు నద్వైతస్థితిఁ, జని యాతఁడు పొందె విష్ణుసాయుజ్యంబున్.[2]

380


క.

ఆజడభరతుఁడును ఘనుం, డై జాతిస్మరణచేత నాత్మజ్ఞాన
వ్యాజమహత్త్వం బొదవఁగ, నాజన్మమునందె ముక్తి కరిగె నరేంద్రా.

381


క.

మానుగ నీజడభరతా, ఖ్యానముఁ జదివినను విన్న నాత్మలు మోహా
ధీనములు గాక సంసా, రానందములందె ముక్తు లగుదురు మనుజుల్.[3]

382


వ.

అని యిట్లు ద్వితీయాంశంబు సమాప్తంబుగాఁ జెప్పి మఱియును.

383


ఉ.

శ్రీమహనీయగేహసరసీరుహబాంధవతుల్యదేహసం
గ్రామధనంజయాంకరిపుగర్వవిదారణకారణక్రియా
భీమతరోగ్రఖడ్గకవిబృందవచఃప్రియచిత్తసద్గుణ
స్తోమసమస్తలోకపరితోషణదానకళావిశారదా.[4]

384


క.

నరరుక్తాంగదభీష్మాం, బరీషశౌనకవసిష్ఠబకదాల్భ్యపరా
శరనారదదైత్యజపుం, డరీకశుకమునివిభీషణవ్యాసనిభా.

385


మాలినీ.

సమరపరశురామా చారుసౌభాగ్యధామా
సమదరిపువికీర్ణా శౌర్యవిద్యాసుపర్ణా

  1. బంధురిపుతుల్యుండవు = చుట్టమును పగవానిని నొక్కటిగాఁ జూచువాఁడవు, సర్వాంతర్యామి = అన్నిటిలో వర్తించునది.
  2. నిర్దేశించి = తెలియఁ జెప్పి.
  3. మానుగన్ = ఒప్పిదముగా, ఆఖ్యానము = కథను.
  4. శ్రీమహనీయగేహ = సంపదచేత గొప్పదైనయిల్లుగలవాఁడా, సరసీరుహబాంధవతుల్యదేహ = సూర్యునివంటి తేజస్సుగల దేహము గలవాఁడా, సంగ్రామధనంజయాంక = సంగ్రామధనంజయుఁడు అను బిరుదుపేరు గలవాఁడా, రిపుగర్వవిచారణక్రియా = శత్రువులగర్వమును పోఁగొట్టుటకు హేతుభూతములైన పనులను చేయువాఁడా, భీమతరోగ్రఖడ్గ = మిక్కిలి భయంకరమైన కత్తి కలవాఁడా, కవిబృందవచఃప్రియచిత్త = కవులసమూహములయొక్క మాటలయందు ప్రీతిగల మనస్సుగలవాఁడా, సద్గుణస్తోమ = మంచిగుణములసమూహములు గలవాఁడా, సమస్తలోకపరితోషణదానకళావిశారదా = ఎల్లలోకులను చక్కగా సంతోషింపఁజేయునట్టి దానవిద్యయందు కుశలుడా.