పుట:Andhra-Natakamulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

47

నాటకప్రదర్శనము.

శ్రీరామునిగురించి;
"హారకేయూరవలరు శిరోభూషణములొప్పార
రఘురాముడు సర్వవైభవాలఘుజనమనోభిరాముడయ్యె"

[అధ్యాత్మరామాయణము]


   "కోమలచారుదుకూలంబువెడలించి
     కర్కిశనల్కాంశుకములుగట్టి.

[భాస్కరరామాయణము.]

      రాజవేషమునందు దువ్వలుపలుకట్టి యంగీల దొడిగి నటులేయున్నది కాని షరాయులుధరించినతు లెక్కడను కానరాదు. తిరుపతిదేవాలయములో శ్రీకృష్ణ దేవరాయలయొక్కయు, వేంకటపతిరాయలయొక్క యు, నిత్తడివిగ్రహములలో బంచకట్టు కాన్పించునే కాని షరాయితొడిగినట్లులేదు. కనుక షరాయిదొడుగుట మన దేశాచారము కాదనియు, తజ్ఞలు సహేతుకముగా దీనిని ఖండించినచో నాతప్పు సవరించుకొనియెదను. కావున నిట్టివేషములు మనకు నైసర్గికములైయుండ మహారాష్ట్రకుళ్లాయలు, బంగాళీటోపీలును, తురకషరాయిలును, మన వారందముకొఱకు వేసికొనుట పామరజనాకర్షణ హేతువుగానున్నను నిచితజ్నులకు హాస్యజనకముగానే యుండును. ఔచిత్యమును మించినవేషము దోషమే.