పుట:Andhra-Natakamulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
48

ఆంధ్రనాటకములు.

3 సంగీతము.

    నాటకములో నటీనటులు పద్యములజదువుటలో సంగీతమెంతవరకు వాడవలెనో యను నంశమును గురించి యనేకవిమర్శకులు భిన్నాభిప్రాయముల నిచ్చియున్నార్. ఈ విషయమును నేను బ్రధమము ననే చర్చించితిని, రసోద్రేకము గలిగించి, తన్మూలముగా బ్రజలకు నీత్యుద్బోధనముగావించు టయే నాటకముయొక్క ముఖ్యోద్దేశము గాన నట్టి రసోద్రేకము గావించెడి సుసాధనము లన్నియు నాటకములయందు వాడదగినవే. అట్టి సాధనముల యందు సంగీతాభినయచిత్రలేఖనములు ముఖ్యము లైనవి. కావున వీటినన్నింటిని నాటకరంగములయందు చితరీతిని బ్రయోగింపదగును.
        నాటకరంగం సంగీతసబకాదని యెఱుంగనగును. సంగీతసభయందు కేవలము సంగీత వైభవమే వినియానందింతుము, నాటకరంగమందు నాటకప్రకృతియొక్క భావూన్మీ లపము జూచియానందింతుము. అట్టిభావూన్మీలనమునకు సంగీతమొక్క యుప సాధనము; గాననంతకంటెదాని కెక్కువ ప్రాముఖ్యత నీయగూడదు. భావప్రకటనకు సంగీత మెంతవఱకు కుగావలెనో యంతయే జూపదగినది. అంతకంటె నెక్కుగవా సంగీతమాలాపనజేసి పద్యములయొక్క యర్ధమును, భావమును సంగీతచాతుర్యమునందు మఱుగువేట్టినయెడల నట్టి పాత్రము సంగీతవిద్వాంసుడనిపించుకొనును కాని మహానటు డనిపించుకొనజాలడు.