పుట:Andhra-Natakamulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

45

నాటకప్రదర్శనము.

అమూల్యనననములను, సామాన్యముగ ధరించెడి మన స్త్రీ పురుషులు నాటకరంగస్థలమున గూడనట్టి విలువగల వస్తువుల ధరించుట సహజమే, అంతియగాక సామాన్యముగ మననాటకములోని నాయికానాయకులు రాజవంశములను గాని, దేవగణములకుగాని చెందినవారగుటచే నవవిధులు వారి యరచేతిలోనె యుండును. అట్టివారెంతవిలువయిన వేషమువేసికొనినను సమంజసముగానుండును. కాని నిరాడంబరము, నిర్ధనమే ముఖ్యజీవికగా నుండదగిన లోకోత్తరులగు మునిపుంగవులు కూద ముకముల్పట్టుకొఱకును, ముచ్చిబంగారము కొఱకును బోట్లాడుట హాస్యస్పదము. ఒకానొక పల్లెటూరి నాటకసమాజములో నారదపాత్రమునుధరించిన యువకుడు పట్టుషరాయియును, స్రిగకుట్టులకోటును నిచినగాని రంగస్థలమునకు వెళ్ళననిపట్టుబట్టెను. పీచుగడ్డము, నెఱ్ఱని జడలసంటించుకొని కోటుషరాయులదొడిగికొనిన నావేషమెంతరమణీయముగ నుండునో ప్రేక్షకులే గ్రహింతురుగాక! నారదుడు కాకపోయినను నబీసాహేబువలె నుండును. ఇట్టి పిచ్చిషోకులకంటె నుచితజ్ఞతయుండిన నెంతమనోజ్ఞముగానుండును? ఏకాలపుపాత్రేమునకాకాలపు వేషమును, యేదేశపు పాత్రమునకాదేశవేషమును ధరించుట స్వతస్సద్ధము. నిరాక్షేపణీయము, మనోహరము, మన యాంధ్రదేశమున కుచితమైన వస్త్రధారణము మన గ్రందకులయందచ్చటచ్చట గాన్పించుచున్నది. మనుచరిత్రయందలి మాయాప్రవరునివేష