పుట:Andhra-Natakamulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 పా త్ర పో ష ణ ము.

శ్లో॥నానాలీలా ప్రకృతయ: ళీలే నాట్యం ప్రతిష్ఠ్జితమే!
 తస్మాల్లోకప్రమాణం హి నాట్యం జ్నేయం ప్రయోకృభి:

[భరతమునినాట్యశాస్త్రము.]


నాటకములయందు వచ్చెడిపాత్రములు సామాన్య
ముగ మూడురకములక్రింద నేర్ఫఱుపవచ్చును.
  1.ప్రకృతిసిద్దములు, 2.పురాణసిధ్దములు 3.కల్పిత ములు.

1.ప్రకృతిసిధ్దములు.

  మానవకోటియందు జాతిభేదమ్లనుబట్టియు, దేశకాల భేదములబట్టియు, వృత్తిబేదములబట్టియు, మనుష్యసంఘమ్లప్రకృత్లు కొంతవఱకు, వేఱువేఱుగ నుండును. అయిననొకానొకదేశమందున్న వారియందు గొన్ని సామాన్యగుణములును, యొకా నొకజాతివారియందు గొన్నిసామాన్యలక్షణములను కాన్పించుచుండును. అట్లె యొకానొకవృత్తి నవలంబించినవారియందు గొంత గుణసాదృశ్యము గలుగుచుండును. ఈసాధృశ్యభేదములను సూక్ష్మదృష్టితో నారసి సమన్యయించి విశేషముగ ప్రకృత్యనుభవజ్ఞానము సంపాదించిన నాడే నాటకముల వ్రాయుటకు గడంగవలయును, ఇట్టియను,