పుట:Andhra-Bhasharanavamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

కణిశైకదేశంబు కనుపట్టు రెల్లనాఁ గణిశభారమ్ము ముంగ యనఁ దనరు
సన్యకుసుమసంజ్ఞ చను సుం కనంగను గుసుమనాఁగను సస్యగుచ్ఛ మొప్పు
గంటకఱ్ఱ యనంగఁ గనుపట్టు నాళంబు కోవి యనంగను గ్రోలనంగ
జా డనంగను క్షీణసస్యంబు దగును బొం దనఁగాను శుష్కసస్యము చెలంగు
ఛిన్నయవముఖనాళంబు చెలఁగుఁ జొప్ప యనఁగ నోదె యనఁగఁ దీర్ణయావనాళ
కాదులు చెలంగుఁ బన యన నలరుచుండుఁ దాదృశవ్రీహిసస్యాఖ్య ధనదమిత్త్ర.

237


సీ.

దంటనఁగా సస్యదండము విలసిల్లుఁ బరఁగు నీన యనంగఁ బత్త్రనాడి
సొరుగాకు కారాకు చొక్కుటాకు వగడు నాఁగను వెలయుఁ జూర్ణాదిశుష్క
పత్త్రాభిధానంబు పరఁగును బుససంజ్ఞ బుసి యనఁగా బసబూగర యనఁ
దుచ్ఛధాన్యాభిభ దోఁచు దాలు తరక పొల్లకట్టు తబకపొల్లు తప్ప
తంక రనఁ దూరునాఁగను దనరుఁ దుషసమేతధాన్యాభిధలు మూఁగబొం తనంగ
మూస యనఁగాను దుషయుక్తములగు స్వల్పధాన్యములు చింక యినుకనఁదగు మహేశ.

238


సీ.

ధాన్యశకలములు దనరు నూక లనంగ నూక పొ ట్టుముకనా నొప్పుఁ దుషము
పినరు పిప్పి యన నిష్పష్టతుషంబగు నుఱుపుడు నాఁగను బరఁగుచుండుఁ
గణిశచూర్ణంబు సద్గ్రహణంబు తూర్పునా వెలయును దృణధాన్యమును చెలంగు
గునుకులు దూసరూల్ గొలివె లనంగను జెలఁగు రోలన నులూఖలము పేరు
కుంది కుందెస యనఁగను గొఱలు వ్రీహ్యులూఖలము ముసల మెసఁగు రోకలి యన
పఱలుఁ బొ న్ననఁగాను శంబకసమాఖ్య భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

239


సీ.

చేటనా శూర్పంబు చెలఁగు మొంటె మొరిఁటె యనఁ బ్రహ్వశూర్పాఖ్య యలరుచుండు
జల్లిజల్లెడ యన జాలని విలసిల్లుఁ గండోల మెసఁగును గంప యనఁగ
సిబ్బి పల్లికనాఁ బ్రసేనవిశేషమౌఁ బుట్ట పుట్టిక పుట్టి పుటిక యనఁగఁ
దనరును బిటకంబు దగ్గుఁ గుసూలాభిధ గాదె యనంగను గరిసె యనఁగఁ
దద్విశేషసమాఖ్యలు దనరుచుండు కొట్టు కూటు పొడక తుమి బొట్ట యనఁగఁ
బరఁగు ఖాతవిశేషము ల్పాఁతర యనఁ నూబ యనఁగను జెంద్రమశ్శాబకధర.

240


సీ.

వంటయి ల్లనఁగను వంటి ల్లనంగ విలసిలుచుండును మహానససమాఖ్య
సూపకారంబు హెచ్చును సువార మనంగ నడరును సూపకారుఁ డడబాల
వంటలవాఁడు సువారంపువాఁడనఁ బొయి ప్రొయ్యి నా నథిశ్రయణి వెలయుఁ
దచ్చిలానామంబు దనరుఁ బొక్కిలి యనఁ బిటకయంత్రాభిధ వెలయు దాలి
యనఁగఁ దంపి యనంగఁ గుండాఖ్య వెలయుచుండు గుండ మనంగను గొండ మనఁగఁ
జరఁగు నంగారధాని కుంపటి యనఁదగు బంగల యనంగ బండికుంపటి యగు భవ.

241