పుట:Andhra-Bhasharanavamu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కొల్లా రనఁగఁ జుట్టుకొల్లారు నలుసాల యనఁ జతుశ్శాలయౌ నల్పగృహము
కొంప లొం పనఁ దగు గుడిసె నా గుడుసు నా నీ రెండు వెలయుఁ గుటీరమునకు
నలకుటీరంబె యానేయ మైన నిలువర మన నిలువార మనఁగాను రహికి నెక్కు
జవికె యనఁ జవిర యనఁగఁ జనుఁ జతుష్కమాకుటి ల్లనఁ బర్ణగేహము దగు భవ.

14


సీ.

బొమ్మరి ల్లనఁగను బుత్రికాగృహ మొప్పుఁ గుంజంబు పొదరి ల్లనం జెలంగు
సజ్జార మనఁగను సామజాగార మౌ లాయ మం చన మందురాఖ్య వెలయుఁ
బండరుపం చన బండారమం చన బొక్కసమం చనఁ బొసఁగుచుండు
నల్లభాండాగార మలశిల్పశాలాఖ్య దనరును డంకనా లనఁ గొటారు
కొట్ట మని పల్కఁగాఁ దగు గోష్ఠగృహము ప్రపకు నభిధానమగుఁ జలిపందిరి యన
బంది లనఁ బంది రనఁగను బరఁగుఁ గాయ మానసంజ్ఞంబులు విఖ్యాతమాతృభూత.

15


సీ.

చప్పరం బనఁగను జనుఁ గాయమానవిశేషంబు కురుజునా స్థిరరథ మగు
దోరపా కనఁగను నోరపా కనఁగను బాదలి యం చన బరఁగుచుండు
భిత్త్యధఃకృతగృహాభిధ దేవళంబునా దేవాలయాఖ్య యై తేజరిల్లు
గుడి కోవెల యనంగ నడరు వర్తులదీర్ఘదేవాలయము లల్పదేవవసతి
చనును దద్దళ మనఁగ వాసగృహసంజ్ఞ నఱ యనఁగ నోవర యనఁగ నలరు సూతి
కాగృహాభిధ పురిటిల్లు నాఁగఁ దనరు మండపం బన మంటపాహ్వయ మగుభవ.

16


సీ.

హర్మ్యాఖ్య మిద్దెనా నలరు నట్టిక యన మచ్చునా నల్పహర్మ్యంబు వెలయు
మే డన సజ్జన మేలుమ చ్చనఁగను నుప్పరిగన సౌధ మొప్పుచుండుఁ
గంకర బెందడి గార సోద యనంగ లేపవిశేషమై తోఁపఁదగును
మాడుగు మాడువు మాలెయం చనఁగను బ్రాసాదభేదమై పరఁగుచుండు
నేలమాలె నా భూమ్యంతరాలయము దనరు సోరణగండి నాఁగను గవాక్ష
మగును లంకనఁగాఁ బ్రకోష్ఠాఖ్య మీఱు, గడపయన దేహళీసంజ్ఞ యడరు నభవ.

17


తే.

సిగర మనఁగను విలసిల్లు శిఖరసంజ్ఞ పొలుచు శిఖరపుఁగొనపేరు మోరునాఁగ
మూలకొత్తళములు చెల్లు బురుజు లనఁగ, భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

18


క.

పెర డనఁ బెడ లనఁ బె ళ్లనఁ, బరఁగున్ గృహపృష్ఠసీమ పంచ యన న్మం
దిరనికట మొప్పు నంగణ, మెఱుఁగం దగు ముంగిలి యన నిందువతంసా.

19


సీ.

దూలమం చన గృహస్థూలతిర్యగ్దారుసంజ్ఞ యై విలసిల్లు స్తంభసంజ్ఞ
మనుచుండు రాడు కంబమన మొగరాడు మొగరంబు నాఁగను దగు నికేత
నాగ్రిమస్తంభాఖ్య యాలయాధారదీర్ఘస్తంభసంజ్ఞ నిట్రాడు నిట్ట
రా డనఁదగు ఛదిరాధార మగు నాస మనఁగాను బెండెయం చనఁగ గేహ